Thursday, March 6Thank you for visiting

Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Spread the love

Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ‘లులు మాల్’ (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో ‘లులు మాల్’ ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన ‘లులు మాల్’ (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి..

ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున లూటీలు జరిగిన విషయం తెలిసిందే.. మాల్‌ను సందర్శించడానికి భారీగా వచ్చిన జనం అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారని సమాచారం.. షాపింగ్ మాల్‌లో అంతటా సగం తినేసిన ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్టు మాల్ యాజమాన్యం పేర్కొంది. ఫుడ్‌ని కూడా సగం తినేసి అక్కడే పడేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Lulu Mall viral video లో సగం తిన్న కప్‌కేక్‌ల నుంచి.. ఖాళీ వాటర్, కూల్ డ్రింక్స్ బాటళ్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని లులు మాల్ ప్రారంభోత్సవం తర్వాత జరిగిన పరిణామాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియో ‘విచారకరమైన’ వాస్తవికతను చూపుతుంది. కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరుపై విమర్షలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలలో సగం తిన్న వస్తువులు, ఖాళీ వాటర్, కూల్ డ్రింక్ సీసాలు, స్టోర్ రాక్‌లలో ఉంచిన రేపర్‌లు, దుకాణాల లోపల విసిరివేయడాన్ని చూడవచ్చు.
కొన్ని వైరల్ వీడియోల్లో మాల్‌లో భారీ జనాలు కనిపించారు. కొన్ని ప్రాంతాలు రద్దీగా ఉండటంతో తొక్కిసలాట జరిగినట్లు అనిపించింది. చెక్‌అవుట్ కౌంటర్‌ల వద్ద ప్రజలు భారీ క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. చాలా మంది వ్యక్తులు ఒకేసారి ఎక్కడంతో మాల్ లో ఎస్కలేటర్‌లు కూడా పనిచేయడం మానేశాయి.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version