Saturday, April 19Welcome to Vandebhaarath

LokSabha Elections | ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తార‌ట‌.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వివాదాస్పద హామీపై విమ‌ర్శ‌లు

Spread the love

LokSabha Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొంద‌రు రాజకీయ నాయకులు ఓట‌ర్ల‌ను ప్ర‌సన్నం చేసుకునేందుకు చిత్ర‌విచిత్ర‌మైన హామీలను గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థి ఏకంగా ఇద్దరు భార్యలకు స్కీమ్‌ ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప‌లువురు ఆయ‌న తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

కేంద్ర మాజీ మంత్రి, రత్లాం (Ratlam) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్ బహురియా(Kantilal Bhuria) సైలనాలో గురువారం జరిగిన‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో వస్తే మహాలక్ష్మీ పథకం కింద ఇచ్చే రూ.లక్షలు ఇస్తామ‌ని, ఒక‌వేళ పురుషుల‌కు ఇద్దరు భార్యలుంటే ఆ ఇద్ద‌రికీ రూ.ల‌క్ష చొప్పున అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న‌వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. కాంతిలాల్ కామెంట్స్ పై అధికార బీజేపీ ((BJP) ) తీవ్రంగా ఖండించింది. కాంతిలాల్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

“కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్ర‌తీ సంవ‌త్స‌రం ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తామని హామీ ఇచ్చామ‌ని, . ఇద్దరు భార్యలు ఉంటే ఇరువురికీ చెరొక లక్ష చొప్పున రూ.2 లక్షలు జ‌మ చేస్తాం అని కాంతిలాల్ చెప్పారు. దీనిపై  బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా భూరియా కాంతిలాల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఎన్నికల సంఘానికి ట్యాగ్ చేశారు. కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉండ‌గా కాంతిలాల్ భురియా 2009 లోక్‌సభ ఎన్నికలలో రత్లాం స్థానం నుంచి విజ‌యం సాధించారు. అయితే 2014లో బిజెపినేత‌ దిలీప్ సింగ్ భూరియా చేతిలో ఓట‌మిపాల‌య్యారు. 2015లో దిలీప్ మరణించడంతో ఆ నియోజకవర్గం ఖాళీగా కాగా అనంత‌రం జ‌రిగిన ఉపఎన్నికల్లో కాంతిలాల్ మరోసారి సీటు గెలుచుకున్నారు. 2019లో బీజేపీకి చెందిన గుమన్ సింగ్ దామోర్ చేతిలో ఓడిపోయారు. కాంతీలాల్ భూరియా 2024లో కాంగ్రెస్ టిక్కెట్‌పై మరోసారి బీజేపీ అభ్యర్థి అనితా చౌహాన్‌పై పోటీ చేస్తున్నారు. మే 13న నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version