Saturday, April 19Welcome to Vandebhaarath

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Spread the love

Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు

ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17) , ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8).

నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏప్రిల్ 25న నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గ‌డువు విధించారు. నామినేష‌న్ల‌ను పరిశీలించిన త‌ర్వాత , 1,970 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా నిర్ధారించారు.

రాష్ట్రాలు, నియోజకవర్గాల జాబితా

ఆంధ్రప్రదేశ్: అరకు (ఎస్టీ), శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం (ఎస్సీ), రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), ఒంగోలు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, తిరుపతి (SC), రాజంపేట, చిత్తూరు (SC)

బీహార్: దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్

జమ్మూ & కాశ్మీర్: శ్రీనగర్

మధ్యప్రదేశ్: దేవాస్, ఉజ్జయిని, మందసోర్, రత్లం, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖాండ్వా

మహారాష్ట్ర: నందుర్భార్, జల్గావ్, రావెర్, జాల్నా, ఔరంగాబాద్, మావల్, పూణే, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్

ఒడిశా: కలహండి, నబరంగ్‌పూర్ (ST), బెర్హంపూర్, కోరాపుట్ (ST)

తెలంగాణ: ఆదిలాబాద్ (ఎస్టీ), పెద్దపల్లి (ఎస్సీ), కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ (ఎస్సీ), భువనగిరి, వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ), ఖమ్మం

ఉత్తరప్రదేశ్: షాజహాన్‌పూర్, ఖేరీ, ధరుహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ (SC)

పశ్చిమ బెంగాల్: బహరంపూర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్

జార్ఖండ్: సింగ్భూమ్, ఖుంటి, లోహర్దగా, పలమౌ

కీలక అభ్యర్థుల జాబితా (Lok Sabha Elections Phase 4  key candidates)

  • అఖిలేష్ యాదవ్ , ఎస్పీ: కన్నౌజ్, ఉత్తరప్రదేశ్
  • మహువా మోయిత్రా, TMC: కృష్ణానగర్, పశ్చిమ బెంగాల్
  • గిరిరాజ్ సింగ్, బీజేపీ : బెగుసరాయ్, బీహార్
  • వైఎస్ షర్మిల, కాంగ్రెస్ : కడప, ఆంధ్రప్రదేశ్
  • అర్జున్ ముండా, బీజేపీ: ఖుంటి, జార్ఖండ్
  • శత్రుఘ్న సిన్హా, TMC: అసన్సోల్, పశ్చిమ బెంగాల్
  • మాధవి లత, బీజేపీ: హైదరాబాద్, తెలంగాణ
  • అసదుద్దీన్ ఒవైసీ, AIMIM హైదరాబాద్ తెలంగాణ
  • బండి సంజయ్ కుమార్, బీజేపీ  కరీంనగర్ తెలంగాణ
  • కిష‌న్ రెడ్డి,  బీజేపీ, సికింద్రాబాద్‌, తెలంగాణ

లోక్‌సభ ఎన్నికల 2024 దశ 1, 2, 3వ విడ‌త పోలింగ్ స‌ర‌ళి

మూడో దశ ముగిసిన తర్వాత, ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, ఓటింగ్ శాతం 64.4 శాతానికి చేరుకుంది, 2019 ఎన్నికలతో ఈ నియోజకవర్గాల్లో 67.33 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి దశలో, 102 నియోజకవర్గాలను కవర్ చేయ‌గా చివరిగా 66.14 శాతం పోలింగ్ నమోదైంది, ఇది 2019తో పోలిస్తే కేవలం 4 శాతం త‌గ్గింది. రెండవ దశలో, 88 స్థానాల్లో 66.71 శాతం పోలింగ్ నమోదైంది. 2019 నుండి సుమారు 3 శాతం త‌గ్గింది. .

ఎన్నిక‌ల సంఘం ప్ర‌కారం.. అస్సాంలో అత్యధికంగా 81.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని 10 నియోజకవర్గాల్లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్ నమోదైంది. ఇవే నియోజకవర్గాల్లో 2019లో 60.01 శాతం పోలింగ్ నమోదైంది. గుజరాత్‌లో 26 నియోజకవర్గాల్లో 25 ఓటింగ్ (సూరత్‌లో బీజేపీ విజయం సాధించింది) 58.98 శాతం పోలింగ్ నమోదైంది. . 2019లో గుజరాత్‌లో 64.5 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లో ఐదు నియోజకవర్గాల్లో 58.18 శాతం పోలింగ్ నమోదైంది,

మహారాష్ట్రలోని 11 నియోజకవర్గాల్లో 61.44 శాతం పోలింగ్ నమోదైంది. గుజరాత్‌తో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్ణాటక, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలో మంగళవారం పోలింగ్ ముగిసింది. తొలి రెండు దశల్లో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ పూర్తయింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version