వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదా...