Thursday, March 6Thank you for visiting

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది…

Spread the love

Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపిన దారుణ ఘటనలో ఓ మైనర్ ను దోషిగా నిర్ధారించిన పోక్సో కోర్టు..అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే మొత్తం రూ.46,000 జరిమానా చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రిజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ బాల నిందితుడిని ఆగస్టు 22న దోషిగా నిర్ధారించిన తర్వాత, అదనపు జిల్లా జడ్జి రాహుల్ సింగ్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం అతను దోషిగా తేలిన వివిధ సెక్షన్ల కింద శిక్షలను ప్రకటించిందని తెలిపారు.

IPCలోని సెక్షన్ 302/34లో బాలనేరస్థుడికి జీవిత ఖైదు రూ.15,000 జరిమానా, సెక్షన్ 452 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5,000 జరిమానా,
అలాగే సెక్షన్ 363 కింద రూ. 5,000 జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు పాండే తెలిపారు. అలాగే IPC, IPC సెక్షన్ 201 కింద ఆరేళ్ల జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా, IPC సెక్షన్ 323 ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు రూ.1,000 జరిమానా విధించారు.

పోక్సో చట్టంలోని సెక్షన్ 5జీ/6 కింద బాలనేరస్థుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మొత్తం ఆరుగురు నిందితులు

సెప్టెంబర్ 14, 2022న ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన జంట హత్యలు, సామూహిక అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారని,
వారిలో నలుగురు పెద్దలు, ఇద్దరు టీనేజర్లు ఉన్నారని మిస్టర్ పాండే చెప్పారు. నలుగురు వయోజన నిందితులకు ఆగస్టు 14న జునైద్, సునీల్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, కరీముద్దీన్, ఆరీఫ్‌లకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు తెలిపారు. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలనేరస్థుడిని ప్రత్యేక పోక్సో కోర్టులో విచారించగా శుక్రవారం శిక్ష ఖరారు చేశామని, ఆరో బాలనేరస్థుడి విచారణ
జువైనల్ జస్టిస్ బోర్డులో కొనసాగుతోందని తెలిపారు.

పాశవికంగా హత్యలు

నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఇద్దరు టీనేజ్ బాలికలను సెప్టెంబర్ 14, 2022 న వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపారు. అనంతరం వారి మృతదేహాలను చెరకు తోటలోని చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన కేసును విచారించేందుకు అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version