
Krishnashtami 2024 | ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రధానమైనది. కృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి, గోకులాష్టమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. విష్ణువు దశావతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానంగా శ్రావణ మాసం కృష్ణ పక్షంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. అందుకే ఈ తిథి రోజున ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? పూజా శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సంవత్సరం జన్మాష్టమి ఆగస్టు 26, 2024న వస్తుంది. తెల్లవారుజామున 3:39 నుంచి ఆగస్టు 27న తెల్లవారుజామున 2:19 వరకు అష్టమి తిథితో ప్రారంభమమవుతుంది. శ్రీకృష్ణుని జన్మకు ముఖ్యమైన రోహిణి నక్షత్రం ఆగస్టు 26న మధ్యాహ్నం 3:55 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27న మధ్యాహ్నం 3:38 గంటలకు ముగుస్తుంది. భక్తులు ఆగష్టు 27 న 12:01 AM నుంచి 12:45 AM వరకు నిశిత పూజను ఆచరిస్తారు, తరువాత అర్ధరాత్రి శుభ ముహూర్తాన్ని 12:23 AM సమయంలో ప్రార్థనలు చేయడం.. నైవేద్యాలు సమర్పించడం చేస్తారు. ఇక ఆధునిక సంప్రదాయాలకు అనుగుణంగా రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:38 గంటలకు ముగియడంతో ఆగస్టు 27న మధ్యాహ్నం 3:38 గంటలకు ఉపవాస దీక్ష చేస్తారు.
నగరాల వారీగా ముహూర్తాలు ఇవే..
దేశ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఆగస్టు 27, 2024న వివిధ సమయాల్లో ప్రారంభమవుతాయి
పూణే 12:13 AM నుంచి 12:59 AM వరకు, న్యూ దిల్లీ 12:01 AM నుంచి 12:45 AM వరకు, చెన్నై 11:48 PM నుంచి 12: 34 AM , జైపూర్ 12:06 AM నుంచి 12:51 AM వరకు.
హైదరాబాద్ 11:55 PM నుంచి 12:41 AM వరకు, గుర్గావ్ 12:01 AM నుండి 12:46 AM వరకు, చండీగఢ్ 12:03 AM నుండి 12:47 AM వరకు, కోల్‌కతా 11:16 PM నుండి 12:01 AM వరకు. ముంబై 12:17 AM నుండి 01:03 AM వరకు, బెంగళూరు 11:58 PM నుండి 12:44 AM వరకు, అహ్మదాబాద్‌లో 12:19 AM నుండి 01:04 AM వరకు, మరియు నోయిడా మధ్యాహ్నం 12:00 నుండి 12:44 AM వరకు ముహూర్తంగా వేదపండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో ఏ సమాచారం ఇవ్వబడినా, అది జ్యోతిష్యులు, పంచాంగాలు, మత గ్రంథాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి మేము ఒక మాధ్యమం మాత్రమే. వినియోగదారులు ఈ సమాచారాన్ని సమాచారంగా మాత్రమే పరిగణించగలరు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..