
Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు.
ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్రమంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్ సమీక్షించారు. మొత్తం 151.36 కి.మీల మేరకు పనులకుగాను ఇప్పటి వరకు 76.135 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తికాగా మరో 75 కి.మీలకుపైగా నిర్మాణ పనులు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని మరో 30 కి.మీలకు పైగా రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది.
ఈ ఏడాదిలోనే వేములవాడ-కొత్తపల్లి
అలాగే ఈ ఏడాది డిసెంబర్ నాటికి వేములవాడ నుంచి కొత్తపల్లి వరకు 31.06 కి.మీల మేరకు నిర్మాణ పనులను, వొచ్చే ఏడాది (2026) మార్చి నాటికి సిరిసిల్ల, వేములవాడ పరిధిలో 10.7కి.మీల పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సిద్దిపేట-సిరిసిల్ల (76.13 కి.మీ నుండి 106.8 కి.మీ) వరకు కొత్త బ్రాడ్ గేజ్ పనులను ప్రారంభించాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తపల్లి స్టేషన్ వద్ద సరుకు రవాణా సౌకర్యాలతో కొత్తపల్లి జంక్షన్ గా అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులను జరుగుతుండగా మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
మరో రెండేళ్లలో కొత్తపల్లి మనోహరాదాబాద్ రైలు
2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ (Kothapalli Manoharabad Railway Line) నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. జమ్మికుంట మండలం ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న ఆర్వోబీ నిర్మాణంపైనా సమీక్షించడం జరిగింది. వచ్చేనెలాఖరుకల్లా నిర్మాణ పనులను పూర్తి చేసి ఉప్పల్ ఆర్వోబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..