
Kolkata Rape case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ (RG KAR MEDICAL COLLEGE) లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య చేసిన నేరాన్ని తారుమారు చేసినట్లు సిబిఐ గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలోని ఛెస్ట్ విభాగంలోని సెమినార్ హాల్‌లో తీవ్రంగా గాయపడిన వైద్యురాలి మృతదేహాన్ని మొదట గుర్తించారు. మరుసటి రోజు ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసులు నిందితుడిగా ఒక సివిల్ వలంటీర్‌ను అరెస్టు చేశారు. ఆగస్టు 13న కలకత్తా హైకోర్టు కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయగా, ఆగస్టు 14న దర్యాప్తు ప్రారంభించింది.
బాధితురాలిని దహనం చేసిన తర్వాతే రాత్రి 11:45 గంటలకు మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. “మేము 5వ రోజు సీన్‌లోకి ప్రవేశించాం. సిబిఐ విచారణ ప్రారంభించడం సవాలుగా మారింది. మొత్తం క్రైమ్ సీన్ మార్చేశారు అని సిబిఐ పేర్కొంది.
సిబిఐ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాత్రి 11.45 గంటలకు దహన సంస్కారాల అనంతరం మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. అంతేకాకుండా బాధితురాలిది ఆత్మహత్యేనని తల్లిదండ్రులకు చెప్పారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ఆసుపత్రిలోని వైద్యుల స్నేహితులు వీడియో తీయాలని పట్టుబట్టారు. అందువల్ల వారు ఏదో తప్పు జరిగిందని కూడా అనుమానించారు.” అత్యాచారం-హత్య ఘటనపై మొదటి ఎంట్రీని నమోదు చేసిన కోల్‌కతా పోలీసు అధికారిని తదుపరి విచారణకు హాజరుకావాలని, సమయాన్ని వెల్లడించాలని SC ఆదేశించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..