Sunday, March 9Thank you for visiting

kanpur viral video: చోరీ చేసిన డబ్బును చూపిస్తూ దొంగల ఇన్‌స్టాగ్రామ్ రీల్‌.. ఆటకట్టించిన పోలీసులు

Spread the love

కాన్పూర్‌లోని జ్యోతిష్కుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించిన ఓ వ్యక్తి, అతని సహచరులు సంబరాల్లో మునిగిపోయారు. మంచంపై డబ్బులను పరుస్తూ.. నోట్ల కట్టలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి పోస్ట్ చేశారు. ఈ వీడియో(kanpur viral video)ను చూసిన పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జ్యోతిష్కుడు తరుణ్ శర్మ నివాసంలో ఇటీవల దొంగలుపడి భారీగా డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశాడు. కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి సంబరాల్లో మునిగిపోయారు. దొంగిలించిన నగదును మంచంపై పరిచి (thieves flaunting stolen money) ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.

మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో (kanpur viral video) క్లిప్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న సాంకేతికత ఆధారంగా ఒక దొంగ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు రూ.లక్షల డబ్బుతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version