
Jio AirFiber vs Airtel Xstream AirFiber | దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ విషయంలో జియో ఎయిర్‌ఫైబర్, అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ వంటి ఆఫర్‌లతో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) టెక్నాలజీ కంటే అత్యాధునికమైనవి. సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కంటే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తాయి.
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)
Jio AirFiber మరియు Airtel Xstream AirFiber రెండూ సమీపంలోని టవర్‌ల నుంచి వైర్‌లెస్ సిగ్నల్‌లను రిసీవ్ చేసుకొని వాటిని మీ డివైజ్ లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. దీంతో ఇంటర్నెట్ కేబుల్స్ అవసరం ఉండదు.. ఇది చాలా మంది వినియోగదారులకు మరింత అనుకూలమైన ఎంపికగా మారుతుంది.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లు:
ధర (INR + GST) | డేటా (GB) | చెల్లుబాటు (రోజులు) | వేగం (Mbps) |
రూ. 599 | 1000 | 30 | 30 వరకు |
రూ. 899 | 1000 | 30 | 100 వరకు |
రూ. 1199 | 1000 | 30 | 100 వరకు |
జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్‌లు:
ధర (INR + GST) | డేటా (GB) | చెల్లుబాటు (రోజులు) | వేగం (Mbps) |
రూ. 1499 | 1000 | 30 | 300 వరకు |
రూ. 2499 | 1000 | 30 | 500 వరకు |
రూ. 3999 | 1000 | 30 | 1000 (1 Gbps) వరకు |
Airtel Xstream AirFiber ప్లాన్స్:
ధర (INR + GST) | డేటా (GB) | చెల్లుబాటు (రోజులు) | వేగం (Mbps) |
రూ. 699 | 1000 | 30 | 40 వరకు |
రూ. 799 | 1000 | 30 | 100 వరకు |
రూ. 899 | 1000 | 30 | 100 వరకు |
Jio AirFiber vs Airtel Xstream AirFiber |రెండు ప్రొవైడర్లు వివిధ స్పీడ్ ఆప్షన్‌లను అందిస్తారు, Jio AirFiber 1 Gbps వరకు వేగాన్ని అందిస్తుంది, అయితే Airtel Xstream AirFiber 100 Mbps వద్ద అనేక ప్లాన్లను అందిస్తోంది. నెలవారీ డేటా పరిమితిని దాటిన తర్వాత, Jio AirFiber వేగం 64 Kbpsకి తగ్గుతుంది. మరోవైపు ఎయిర్‌టెల్ 2 Mbps వేగాన్ని అందిస్తుంది. డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వేగాన్ని పెంచడానికి Jio డేటా సాచెట్‌లను యాడ్-ఆన్‌లుగా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అందించడం లేదు.
OTT ప్రయోజనాలు
Jio, Airtel రెండూ తమ ప్లాన్‌లతో OTT ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ మొదలైన ప్లాట్‌ఫారమ్‌లతో సహా జియో మరింత విస్తృతమైన ప్యాకేజీని అందిస్తుంది. Airtel Xstream AirFiberలో ప్రధానంగా డిస్నీ+ హాట్‌స్టార్, Xstream ప్లే ఉన్నాయి.
భారతదేశం అంతటా 5,846 పట్టణాల్లో సేవలు అందుబాటులో ఉండటంతో జియో ఎయిర్‌ఫైబర్ విస్తృత రేంజ్ కలిగి ఉంది. Airtel Xstream AirFiber ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం మరిన్ని నగరాలకు విస్తరించే పనిలో ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..