Tuesday, March 4Thank you for visiting

Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

Spread the love

 

Janasena TDP First List : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ బ‌హిరంగ‌ సభలు పెట్టి ఒకరినొకరు తీవ్ర‌స్థాయిలో దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది.

Janasena TDP First List టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన మొద‌టి జాబితాలను వెల్లడించారు. ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించచ‌గా, జనసేన మొత్తం 175 స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాల్లో అలాగే మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల విష‌యానికొస్తే.. బెందాళం అశోక్‌ ఇచ్ఛాపురం నుంచి, కొండ్రు మురళి రాజాం నుంచి , అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ పడనున్నారు. అలాగే ఆముదాల వలస నుంచి కూన రవికుమార్‌, గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్‌, పాలకొల్లు నుంచి నిమ్మల రామ నాయుడు, జగ్గంపేట నుంచి వెంకటఅప్పారావు బరిలో దిగ‌నున్నారు. ఇక ఐదుగురు అభ్యర్థులతో కూడిన జనసేన మొద‌టి జాబితాలో నాదెండ్ల మనోహర్‌ (తెనాలి), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి) ఉన్నారు.

టీడీపీ అభ్య‌ర్థుల‌ జాబితా..

శ్రీకాకుళం
1. ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
2. టెక్కలి- అచ్చెన్నాయుడు
3. ఆమదాలవలస- కూన రవికుమార్
4. రాజాం- కొండ్రు మురళి
5. బొబ్బిలి- రంగారావు(బేబి నాయన )
6. గజపతి నగరం- కొండపల్లి శ్రీనివాస్
7. విజయనగరం- పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
8.కురుపాం- తోయక జగదీశ్వరి
9. పార్వతీపురం- విజయచంద్ర
10. సాలూరు- గుమ్మడి సంధ్యారాణి
11. అరకు- సియ్యారి దన్ను దొర
12. విశాఖపట్నం ఈస్ట్‌- వెలగపూడి రామకృష్ణబాబు
13. విశాఖ పట్నం వెస్ట్‌- గణబాబు
14 పాయకరావుపేట- వంగలపూడి అనిత
15. నర్సీపట్నం- చింతకాయల అయ్యన్నపాత్రుడు
16.. తుని- యనమల దివ్య
17 పెద్దాపురం- నిమ్మకాల చినరాజప్ప
18. జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
19. అనపర్తి- నల్లమిల్లి రాధాకృష్ణారెడ్డి
20. రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి వాసు
21. ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు
22. పి. గన్నవరం – రాజేష్‌ మహాసేన
23. కొత్తపేట – బండారు సత్యనారాయణ
24. మండపేట- వేగుళ్ల జోగేశ్వరరావు
25 ఆచంట – పితాని సత్యనారాయణ
26. పాలకొల్లు -నిమ్మల రామానాయుడు
27 ఉండి మంతెన రామరాజు
28 తనకు -ఆరిమిల్లి రాధా కృష్ణ
29 ఏలూరు-బడేటి రాధా కృష్ణ
30 చింతలపూడి (SC) -సొంగ రోషన్
31 తిరువూరు (SC) -కొలికపూడి శ్రీనివాస్
32 నూజివీడు -కొలుసు పార్ధసారధి
33 గన్నవరం -యార్లగడ్డ వెంకట్ రావు
34 గుడివాడ -వెనిగండ్ల రాము
35 పెడన -కాగిత కృష్ణ ప్రసాద్
36 మచిలీపట్నం -కొల్లు రవీంద్ర
37 పామర్రు (SC) -వర్ల కుమార రాజా
38 విజయవాడ సెంట్రల్ -బోండా ఉమ
39 విజయవాడ తూర్పు -గద్దె రామ్మోహనరావు
40 నందిగామ (SC) -తంగిరాల సౌమ్య
41 జగ్గయ్యపేట -శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
42 తాడికొండ (SC) -తెనాలి శ్రావణ్ కుమార్
43 మంగళగిరి -నారా లోకేష్
44 పొన్నూరు -ధూల్లిపాళ్ల నరేంద్ర
45 వేమూరు (SC) -నక్కా ఆనంద్ బాబు
46 రేపల్లె -అనగాని సత్య ప్రసాద్
47 బాపట్ల -వేగేశన నరేంద్ర వర్మ
48 ప్రత్తిపాడు (SC) -బర్ల రామాంజనేయులు
49 చిలకలూరిపేట -ప్రత్తిపాటి పుల్లారావు
50 సత్తెనపల్లె -కన్నా లక్ష్మీనారాయణ
51 వినుకొండ -జివి ఆంజనేయులు
52 మాచర్ల -జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
53 యర్రగొండేపాలెం (ఎస్సీ) -గూడూరి ఎరిక్షన్ బాబు
54 పర్చూరు -ఏలూరి సాంబశివరావు
55 అద్దంకి -గొట్టిపాటి రవి కుమార్
56. సంతనూతలపాడు (SC)-బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్
57. ఒంగోలు -దామచర్ల జనార్దనరావు
58 కొండపి -డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
59 కనిగిరి -ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
60 కావలి -కావ్య కృష్ణా రెడ్డి
61 నెల్లూరు నగరం -పి.నారాయణ
62 నెల్లూరు రూరల్ -కోటుంరెడ్డి శ్రీధర్ రెడ్డి
63 గూడూరు (SC) -పాసం సునీల్ కుమార్
64 సూళ్లూరుపేట (ఎస్సీ) -నెలవెల విజయశ్రీ
65 ఉదయగిరి -కాకర్ల సురేష్
66 కడప -మాధవి రెడ్డి
67 రాయచోటి -మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
68 పులివెండ్ల -మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
69 మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
70 ఆళ్లగడ్డ -భూమా అఖిల ప్రియా రెడ్డి
71 శ్రీశైలం -బుడ్డ రాజ శేఖర్ రెడ్డి
72 కర్నూలు -TG భరత్
73 పాణ్యం -గౌరు చార్తిహా రెడ్డి
74 నంద్యాల -Nmd. ఫరూఖ్
75 బనగానపల్లె -బీసీ జనార్దన్ రెడ్డి
76 డోన్‌ -కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
77. పత్తికొండ – కేఈ శ్యామ్ బాబు
78 కోడుమూరు -బొగ్గుల దస్తగిరి
79 రాయదుర్గం -కాల్వ శ్రీనివాసులు
80 ఉరవకొండ -పి.కేశవ్
81 తాడిపత్రి -జె. సి . అశ్మిత్ రెడ్డి
82 సింగనమల (SC) -బండారు శ్రావణి శ్రీ
83 కళ్యాణదుర్గం -అమిలినేని సురేందర్ బాబు
84 రాప్తాడు -పరిటాల సునీత
85 మడకశిర (SC) -M E సునీల్ కుమార్
86 హిందూపూర్ -నందమూరి బాలకృష్ణ
87 పెనుకొండ -సవిత
88 తంబళ్లపల్లె -జయచంద్రారెడ్డి
89 పీలేరు -నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
90 నగరి -గాలి భాను ప్రకాష్
91 గంగాధర నెల్లూరు (SC)-డాక్టర్ వి ఎం థామస్

92 చిత్తూరు -గురజాల జగన్ మోహన్

93 పలమనేరు -ఎన్ అమరనాథ్ రెడ్డి
94 కుప్పం -నారా చంద్రబాబు నాయుడు

జనసేన పోటీ చేసే మొదటి జాబితా అభ్యర్థులు

  1. అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
  2. నెల్లిమర్ల- మాధవి
  3. కాకినాడ రూరల్- పంతం నానాజీ
  4. తెనాలి- నాదేండ్ల మనోహర్
  5. రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version