
Jan Aushadhi | న్యూఢిల్లీ: దేశంలో జనరిక్ ఔషధాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బ్రాండెడ్ మందులతో పోలిస్తే అతితక్కువ ధర కలిగి ఉండడం ఇందుకు ప్రధాన కారణం.. జనరిక్ మందులపై క్రమంగా పేద సామాన్య మధ్యతరగతి ప్రజల్లో నమ్మకం పెరగడంతో వారంతా ఇప్పుడు జనరిక్ మందులనే ఆశ్రయిస్తున్నారు. కాగా జన్ ఔషధి ఔట్‌లెట్ల విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 1,000 కోట్ల మార్కుకు చేరుకున్నాయి
ముఖ్యంగా, ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) సెప్టెంబర్ 2024 ఒక్క నెలలో రూ. 200 కోట్ల విలువైన మందులను విక్రయించింది. గత 10 సంవత్సరాలలో దేశంలో జన్ ఔషధి అవుట్‌లెట్ల సంఖ్య 170 రెట్లు పెరిగింది. 2014లో 80 అవుట్‌లెట్‌లు ఉండగా, ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 14,000 అవుట్‌లెట్‌లకు పైగా విస్తరించాయి.
“ఈ గణంకాలు.. చవకైన, నాణ్యమైన మందులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా 14,000 కంటే ఎక్కువ జన ఔషధి కేంద్రాలు (Jan Aushadhi kendra ) అందుబాటులోకి రావడంతో ప్రజలు ఎక్కువగా ఈకేంద్రాల్లోనే కొనుగోలు చేస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఖర్చులను తగ్గించడం ద్వారా అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు PMBI పటిష్ట చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్లలో దేశంలో దాదాపు 25,000 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) కింద ప్రస్తుతం 2,047 మందులు, 300 సర్జికల్ పరికరాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..