
Israel News : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన కీలక నేత హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులను కొనసాగిస్తోంది. గత వారం క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని బీరూట్‌లో వైమానిక దాడిల్లో ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే.. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి అంతమొందించింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతలంపై నుంచి దక్షిణ లెబనాన్‌లో దాడులను కొనసాగిస్తోంది.
తాజాగా హిజ్బుల్లాకు చెందిన కీలక నేత, ఆ గ్రూప్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అధిపతి అయిన మహ్మద్ రషీద్ సకాఫీని బీరూట్‌లో గురువారం చేపట్టిన దాడుల్లో ఎలిమినేట్ చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. సకాఫీ ఒక సీనియర్ హిజ్బుల్లా తీవ్రవాదిగా, అతడు 2000 నుంచి కమ్యూనికేషన్స్ విభాగానికి చీఫ్‌గా కొనసాగుతున్నాడు. హిజ్బుల్లాకి చెందిన అన్ని యూనిట్ల మధ్య కమ్యూనికేషన్ సామర్థ్యం పెంచేందుకు పనిచేశాడు.