Saturday, April 19Welcome to Vandebhaarath

IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్‌ రూమ్‌ లాంటి గది, రూ.100తో బుక్‌ చేయొచ్చు

Spread the love

 

IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్‌ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి, భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న చాలా వసతుల గురించి సరైన అవగాహన ఉండడం లేదు.
మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గానీ, కునుకు తీయడాని గానీ, లేదా స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి కాసేపు రెస్ట్ తీ కోసం ఒక గదిని కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే హోటల్ రూంం వంటి గదిలో గడపొచ్చు.

కేవలం రూ.100కే రూమ్‌ బుకింగ్‌

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను IRCTC అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని రిటైరింగ్‌ రూమ్స్‌ (Retiering Rooms) అని పిలుస్తారు. ఏసీ, నాన్‌ ఏసీ, సింగిల్‌, డబుల్‌, డార్మిటరీ విభాగాలలో రిటైరింగ్‌ రూంలు ‌ అందుబాటులో ఉంటాయి. నిద్ర పోవడానికి బెడ్ తో సహా ప్రయాణికుల కోసం మరికొన్ని వసతులు ఈ గదుల్లో ఉంటాయి. ప్రాంతం/డిమాండ్‌ను బట్టి రూ.100 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

రిటైరింగ్‌ రూ‌ం ఎలా బుక్‌ చేయాలి?

రిటైరింగ్‌ రూమ్ బుక్ చేసుకునేందుకు మొదట IRCTC అఫిషియల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్‌ పేజీలో.. మీ యూజర్‌ ఐడీ అండ్ పాస్‌వర్డ్‌ తో లాగిన్‌ అవ్వండి.
తర్వాత ‘My booking’లోకి ఆప్షన్ క్లిక్ చేయండి..
మీ టికెట్ బుకింగ్ కింద, ‘Retiring room’ అనే ఆప్షన్ కనిపిస్తుంది
దానిపై క్లిక్ చేస్తే, గదిని బుక్ చేసుకునే ఆప్షన్‌ మీకు చూపిస్తుంది.
ఇక్కడ PNR నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత, కొంత వ్యక్తిగత సమాచారం, జర్నీ టైమ్‌, స్టే చేయాలనుకున్న రైల్వే స్టేషన్‌ పేరు దవటి వివరాలు ‌ ఇవాల్సి ఉంటుంది
తర్వాత చెక్‌ ఇన్‌, చెక్‌ ఔట్‌ తేదీ సహా అక్కడ అడిగిన వివరాలను నింపాలి.
రూమ్‌ ఓకే చేసుకున్న తర్వాత పేమెంట్‌ చేయాలి..
ఇక్కడితో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్‌ రూమ్‌ బుకింగ్‌ పూర్తవతుంది

వీళ్లకు మాత్రమే రిటైరింగ్‌ రూమ్‌

అయితే రిటైరింగ్‌ రూమ్‌ను అందరికీ కేటాయించరు. ట్రైన్‌ టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన వ్యక్తులు మాత్రమే రిటైరింగ్‌ రూంను బుక్‌ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ మీ పేరు వెయిట్ జాబితా‌లో ఉంటే, ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు.. దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని, టికెట్‌తో పాటే ఆన్‌లైన్‌ లో బుక్‌ చేసుకోవచ్చు. లేదా, కన్ఫిర్మ్‌ అయిన టికెట్ చూపించి రైల్వేస్టేషన్‌లో (ఆఫ్‌ లైన్‌) నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. IRCTC Retiering Room Booking

బుక్‌ చేసుకున్న రూమ్ ను క్యాన్సిల్‌ చేసుకోవచ్చా?

రిటైరింగ్‌ గదిని బుక్‌ చేసుకున్న తర్వాత, ఏ కారణం చేతనైనా మీరు ఆ గదిని కాన్సిల్ చేసుకోవాలనుకుంటే, ఎలాంటి ఇక్కట్లు లేకుండా రూం బుకింగ్‌ క్యాన్సిల్‌ చేయవచ్చు. చెక్‌ఇన్ టైమ్‌ కంటే 48 గంటల కంటే ముందే రూమ్‌ బుకింగ్‌ రద్దు చేసుకుంటే 10% మినహాయించుకుని మిగిలిన డబ్బులు రిఫండ్‌ చేస్తారు. రూమ్‌ బుకింగ్‌ ఛార్జ్‌ కింద 10% తీసుకుంటారు. 24 గంటల ముందు రద్దు చేసుకుంటే 50% శాతం మినహాయిస్తారు. 24 గంటల్లోపు రిటైరింగ్‌ రూం‌ బుకింగ్‌ను క్యాన్సిల్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించరు..


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version