
IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త.. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన ఇబ్బందులు త్వరలో ఉండకపోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు వెయిటింగ్ పీరియడ్‌లో ఇబ్బంది పడకుండా ఉండేలా త్వరలో టిక్కెట్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 2025 నాటికి పూర్తవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత, రైలు ప్రయాణీకుల టిక్కెట్‌లు ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. హోమ్ పేజీపై క్లిక్ చేసిన తర్వాత వెంటనే వారికి టికెట్ కన్ఫార్మ్ అవుతుంది.
టికెట్ బుకింగ్ మొత్తం ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది ప్రయాణికులు తక్కువ సమయంలోనే టిక్కెట్‌ను బుక్ చేసుకోగలరు. అంతేకాకుండా IRCTC ప్రయాణికులు తమ డబ్బు డ్రా అయి కూడా టిక్కెట్లు బుక్ కాకపోవడం వంటి సమస్లయు ఇకపై తలెత్తవని అధికారులు చెబుతున్నారు.
IRCTC ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) సంజయ్ జైన్ టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు పేమెంట్ ఫెయిల్ కావడం. కన్ ఫర్మ్ టిక్కెట్ల కోసం వేచి ఉండే సమయం వంటి సమస్యలు ఉండేవని చెప్పారు. టికెట్ బుకింగ్ విధానంలో లోపాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురయ్యేవని సీఎండీ చెప్పారు. ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ను ప్రాసెస్ చేసే వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే, బుకింగ్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
నివేదికల ప్రకారం, ప్రయాణీకుల ఆన్‌లైన్ బుకింగ్, ఏజెంట్ బుకింగ్‌తో సహా ప్రస్తుతం ప్రతిరోజూ తొమ్మిది లక్షలకు పైగా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. ప్రతిరోజు రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. గత సంవత్సరం, భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని నిమిషానికి 25,000 నుంచి 2.25 లక్షలకు అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే పటిష్టమైన చర్యలు చేపట్టింది.
ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సహా టికెటింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రైల్వేలకు కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో టికెటింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..