Tuesday, March 4Thank you for visiting

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

Spread the love

IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు

  • రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్)
  • రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్)
  • రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్)
  • రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్)
  • రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్)

మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద‌న‌పు కోచ్ ల‌ను పెంచుతున్నామ‌ని Northern Railway చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దీపక్ కుమార్ ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version