Wednesday, April 16Welcome to Vandebhaarath

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు
World

వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు

Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు. తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు. అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 ఉందని, 250కి చేరుకుంటుందని అంచనా వేశారు. ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి..  అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది. సమాంతర తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ, 2,000 మందికి పైగా మరణించారు.. వేలాది మం...
World

ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీకి అంతర్జాతీయ అవార్డుల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జూలై 13న (స్థానిక కాలమానం ప్రకారం) 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్', పురస్కారాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతులమీదుగా అందుకున్నారు. ఇది అత్యున్నత ఫ్రెంచ్ గౌరవం. గడచిన తొమ్మిదేళ్ల పదవీకాలంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆయనకు ప్రదానం చేసిన 14వ అత్యున్నత రాష్ట్ర గౌరవం ఇది. ఈ గుర్తింపులు ప్రధాని మోదీ నాయకత్వం.. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని బలంగా నిలబెట్టిన ఆయన దార్శనికతకు ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలను కూడా ఇది చాటుతుంది. ప్రధాని మోదీకి లభించిన అవార్డులను ఒకసారి చూద్దాం: జూన్ 2023లో ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ప్రధాని మోదీకి ఈజిప్ట్ యొక్క అత్యున్నత రాష్ట్ర ...
World

ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ పురస్కార ప్రదానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత గౌరవమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ (Grand Cross of the Legion of Honour) ’ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు.  దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. ఈ గౌరవానికి భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న మోదీ (Prime Minister Narendra Modi ) కి రెడ్ ఘన స్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఇక్కడ ఎలిసీ ప్యాలెస్‌లో జరిగిన అ...
World

ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచిన ఇండియన్ ఎయిర్ పోర్ట్ ఇదే..

ముంబై: అమెరికాకు చెందిన ట్రావెల్ మ్యాగజైన్  ట్రావెల్ + లీజర్ (Travel + Leisure) ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయాల(World's Best International Airports) పై చేపట్టిన సర్వేలో ముంబై విమానాశ్రయం నాలుగో స్థానంలో నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) ఈ సంవత్సరం ట్రావెల్ + లీజర్ రీడర్‌లకు ఇష్టమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏకైక భారతీయ విమానాశ్రయంగా నమోదైంది. విమానాశ్రయాల యాక్సెస్, చెక్-ఇన్, భద్రత, రెస్టారెంట్లు, బార్‌లు, షాపింగ్ డిజైన్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలను ఎంపిక చేసింది. "ఈ గుర్తింపు ప్రపంచ స్థాయి ఆతిథ్యంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో Chhatrapati Shivaji Maharaj International Airport  (CSMIA ) మేటిగా నిలిందని ఈ సర్వే చెబుతోంది.  CSMIA ప్రయాణికులపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఈ గౌరవప్రదమైన జాబితాలో తన అర్హతను ...
World

అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

పర్యటనలో ముఖ్యాంశాలు ఇవీ.. న్యూఢిల్లీ : ఆరు రోజుల పాటు అమెరికా తోపాటు , ఈజిప్తు లో తన తొలి పర్యటనను ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ కి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి.లేఖి,  రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్ తో స హా పలు పార్టీల ఎంపీలు ఘనస్వాగతం పలికారు. సోమవారం తెల్లవారుజామున, ప్రధాని మోదీ తన మొదటి ఈజిప్ట్ పర్యటన వివరాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ట్విటర్ లో ప్రధాని మోదీ క్లిప్‌ను ట్యాగ్ చేస్తూ, "నా ఈజిప్టు పర్యటన ఒక చారిత్రాత్మకమైనది. ఇది భారతదేశం-ఈజిప్ట్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.’’ అని పేర్కొన్నారు ఈజిప్ట్ అత్యున్నత గౌరవం ఈజిప్టు అత్యున్నత గౌరవాన్ని(Egypt's Highest Honour) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి చేతుల మీదుగా ప్రధాని మోదీ ...
World

Titanic submarine: రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతం..ఐదుగురు బిలీనియర్లు మృతి.

Titanic submarine: సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ఓడ శిథిలాను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రయాణం విషాదాంతంగా మారింది. నీటిలోకి దిగిన గంటా 45 నిమిషాలకు ఈ వాహనం కాంటాక్స్ కోల్పోయింది. టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు పర్యాటకును తీసుకువెళ్లే టైటాన్ సబ్‌మెర్సిబుల్ వాహనం ఐదుగురు పర్యాటకులతో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి గత ఆదివారం జూన్ 18న బయలుదేరింది. అట్లాంటిక్ సముద్రంలో నీటిలోకి వెళ్లన రెండు గంటల్లోనే అది తప్పిపోయిన విషయం తెలిసిందే.  అయితే ఈ వాహనం ఆచూకీ కనుగొనేందుకు.. అందులో ఉన్న ఐదుగురు బిలీనియర్లను కాపాడేందుకు అట్లాంటిక్ మధ్యలో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. టైటాన్లో కేవలం 96 గంటలకు మాత్రమే సరపడే ఆక్సిజన్ నిల్వలే ఉండటంతో అనుణక్షణం ఉత్కంఠగా మారింది. దీంతో రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టినప్పటికీ జాడ దొరకలేదు. అయితే అధిక తీవ్రమైన పీడనం వల్ల టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan su...
World

ఉగాండాలో మారణహోమం

పాఠశాలపై తిరుగుబాటుదారుల దాడిలో 37 మంది విద్యార్థుల మృతి కంపాలా : ఆఫ్రికా దేశం ఉగాండాలో తిరుగుబాటుదారులు మారణహోమం సృష్టించారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో లింకు ఉన్న మిలిటెంట్లు పశ్చిమఉగాండాలో 37 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి కాల్చి పొట్టనపెట్టుకున్నారు.. ఇది ఒక దశాబ్దంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సమీపంలో కాసేస్ జిల్లాలోని ఎంపాండ్‌వేలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాడి చేశారు. డార్మిటరీని తగలబెట్టి, ఆహారాన్ని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థులను కత్తులతో పాశవికంగా నరికివేశారు. "దురదృష్టవశాత్తూ 37 మృతదేహాలు కనుగొన్నామని, వాటిని బ్వేరా ఆసుపత్రి మార్చురీకి తరలించారని" ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (UPDF) ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్యే ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది మంది గాయప...
Exit mobile version