
Indian Railways Update | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది. భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు.
హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది.
భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్
అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ ఈ5 రైలు స్ఫూర్తితో బులెట్ ట్రైన్ (Bullet Train) ను ప్రారంభించాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ హైస్పీడ్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. అయితే, రైలు వాణిజ్యపరంగా వేగం గంటకు 250 కిలోమీటర్ల వద్ద మాత్రమే పరిమితం చేయనున్నారు. ఈ కొత్త రైలు భారతదేశంలోనే పూర్తిగా తయారీ చేయబడుతుంది, ఇది సంవత్సరం చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ముంబై-అహ్మదాబాద్ ట్రాక్ మొదటి ట్రయల్ రన్
బుల్లెట్ ట్రైన్ మొదటి ట్రయల్ రన్ ముంబై-అహ్మదాబాద్ ట్రాక్‌లో నిర్వహించనున్నారు. ఇది భారతదేశం స్వంతంగా స్థానికంగా తయారు చేయబడిన బుల్లెట్ రైలుగా నిలిచింది. అన్ని ఉత్పత్తి ప్రక్రియలు భారతదేశంలోనే జరుగుతాయి. ఇది వచ్చే ఏడాదివరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
Indian Railways Update నివేదికల ప్రకారం, దాదాపుగా సిద్ధంగా ఉన్న భారతదేశపు అత్యంత వేగవంతమైన రైళ్ల బ్లూప్రింట్, రైలు వివరాలను భారతీయ రైల్వేలు అతి త్వరలో వెల్లడించవచ్చని భావిస్తున్నారు. భారతీయ రైల్వే సీనియర్ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ రైలు నిర్మాణం ప్రారంభమైన తర్వాత, ఇది పట్టాలెక్కడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే, దీని నిర్మాణం 2024 చివరిలో ప్రారంభమైతే, దాదాపు 2027 నాటికి రైలు పనిచేయడం ప్రారంభించవచ్చు. అయితే, 2027 నాటికి ఆపరేషన్ ప్రారంభించి రైలు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై పూర్తి సమాచారం వెల్లడి కాలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు