Saturday, April 19Welcome to Vandebhaarath

Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..

Spread the love

Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవ‌ల కాలంలో రైళ్ల‌లో ప్ర‌యాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొర‌క‌క ప్ర‌జ‌లు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారు. రైళ్ల‌న్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖ‌కు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ రైల్వే తాజా నిర్ణ‌యం తీసుకుంది.

అదనపు కోచ్‌లు జ‌త‌చేసిన రైళ్ల జాబితా..

17421/17422 తిరుపతి కొల్లాం ఎక్స్‌ప్రెస్
12703/12704 హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
15634/15633 గౌహతి బికనీర్ ఎక్స్‌ప్రెస్
15631/15632 గౌహతి బార్మర్ ఎక్స్‌ప్రెస్
15630/15629 సిల్‌ఘాట్ టౌన్ తాంబరం నాగావ్ ఎక్స్‌ప్రెస్
15647/15648 గౌహతి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
15651/15652 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్
15653/15654 గౌహతి జమ్ము తావి ఎక్స్‌ప్రెస్
15636/15635 గౌహతి ఓఖా ఎక్స్‌ప్రెస్
12510/12509 గౌహతి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
15909/15910 దిబ్రూగర్ లాల్‌గర్ అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్
12703/12704 హౌరా సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
20415/20416 వారణాసి ఇండోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
20413/20414 కాశీ మహాకల్ వారణాసి ఇండోర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
13351/13352 ధన్‌బాద్ అలప్పుజా ఎక్స్‌ప్రెస్
14119/14120 కత్గోడం డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్
12976/12975 జైపూర్ మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12253/12254 బెంగళూరు భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
16527/16528 యశ్వంత్‌పూర్ కన్నూర్ ఎక్స్‌ప్రెస్
16209/16210 అజ్మీర్ మైసూర్ ఎక్స్‌ప్రెస్
16236/16235 మైసూర్ టుటికోరిన్ ఎక్స్‌ప్రెస్
16507/16508 జోధ్‌పూర్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్
20653/20654 KSR బెంగళూరు సిటీ బెల్గాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
17311/17312 చెన్నై సెంట్రల్ హుబ్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12253/12254 బెంగళూరు భాగల్పూర్ అంగా ఎక్స్‌ప్రెస్
16559/16590 బెంగళూరు సిటీ సాంగ్లీ రాణి చెన్నమ్మ ఎక్స్‌ప్రెస్
09817/09818 కోట జంక్షన్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
19813/19814 కోటా సిర్సా ఎక్స్‌ప్రెస్
12972/12971 భావ్‌నగర్ బాంద్రా టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
19217/19218 వెరావల్ జంక్షన్ ముంబై బాంద్రా టెర్మినస్ వెరావల్ జంక్షన్ సౌరాష్ట్ర జంతా ఎక్స్‌ప్రెస్
22956/22955 ముంబై బాంద్రా టెర్మినస్ – భుజ్ కచ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
20908/20907 భుజ్ దాదర్ సాయాజీ నగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
11301/11302 ముంబై బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్
12111/12112 ముంబై అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
12139/12140 ఛత్రపతి శివాజీ టెర్మినస్ నాగ్‌పూర్ సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్

తెలుగు రాష్ట్రాల్లో 12 ఎక్స్ ప్రెస్ రైళ్లకు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నడిచే 12 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అందులో సింహపురి, ఫలక్నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్-కాకినాడ, కాకినాడ-షిర్డీ, కాకినాడ-LTT రైళ్లకు అదనంగా రెండు జనరల్ బోగీలు, మచిలీపట్నం – ధర్మవరం రైలుకు  ఒక అదనపు బోగీని జతచేస్తున్నామని ప్రకటించింది. ఈ రైళ్లలో ఇప్పటికే 2 జనరల్ బోగీలు ఉండగా, నవంబర్ నుంచి మొత్తం 4 కోచ్ లతో ఇవి నడవనున్నాయి.

పెద్ద మొత్తంలో కోచ్ ల త‌యారీ..

Indian railways news : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 4,485 నాన్-ఎసి కోచ్‌లను, 2025-26లో వీటిలో మరో 5,444 ఉత్పత్తిని పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అదనంగా, రైల్వే తన రోలింగ్ స్టాక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి 5300 కంటే ఎక్కువ సాధారణ కోచ్‌లను రూపొందించాలని భావిస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రైల్వే 2605 జనరల్ కోచ్‌లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేకమైన అమృత్ భారత్ జనరల్ కోచ్‌లు ఉన్నాయి.

వీటితో పాటు, 1470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు, 323 ఎస్‌ఎల్‌ఆర్ (సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్) కోచ్‌లు, ఇందులో అమృత్ భారత్ కోచ్‌లు, 32 హై కెపాసిటీ పార్శిల్ వ్యాన్‌లు, 55 ప్యాంట్రీ కార్లు విభిన్న ప్రయాణీకుల అవసరాలు రవాణా అవసరాలను తీర్చడానికి తయారు చేయ‌నున్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version