Wednesday, March 5Thank you for visiting

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్

Spread the love

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు.  తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11:49కు జగిత్యాల చేరుకుంటుందని  వెల్లడించారు. కాగా రైలు సర్వీస్ పున: ప్రారంభించిన రైల్వే అధికారులు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రైల్వే టికెట్స్‌ బుకింగ్‌  గడువు తగ్గింపు!

మరోవైపు రైలు టిక్కెట్ ముందస్తు బుకింగ్ గడువును కూడా భారతీయ రైల్వే తగ్గించి ప్రయాణికులకు భారీ ఊరట కలిగించింది. . రైల్వే శాఖ గతంలో ఉన్న 120 రోజుల గడువును 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా అక్టోబర్ 31 వరకు 120 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని భారతీయ రైల్వే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. అయితే టిక్కెట్స్ క్యాన్సిల్ చేసుకునేందుకు 60 రోజుల గడువు వర్తించదు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నడిచే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా ఈ టైమ్ లిమిటేషన్ వర్తించదు. అయితే, కొన్ని డే-టైమ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో నిబంధనలలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ముందస్తు రిజర్వేషన్ కోసం తక్కువ సమయ పరిమితి వర్తిస్తుంది. అలాగే విదేశీ పర్యాటకులకు 365 రోజుల వ్యవధిలో కూడా ఎలాంటి మార్పు లేదు. . విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఏడాది ముందుగానే (365 రోజులు) రైలు టిక్కెట్ ను బుక్ చేసుకుంటారు. అలాంటి వారికి ఈ నిబంధన వర్తించదని రైల్వే శాఖ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version