
South Central Railway | ప్రయాణకులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని పలు కీలక మార్గాల్లో ప్రయాణించే రైళ్లకు అదనపు కోచ్ లను జోడించనున్న ట్లు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అదనంగా కోచ్ లను జతచేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్రయాణికుల కు తాజా నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించనుంది.
ఈ రైళ్లకు ఆదనపు కోచ్ లు
- Tirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ – తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది.
- రైలు నెం. 16058: తిరుపతి – డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఇవే తేదీలలో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ ఉంటాయి.
- రైలు నంబర్ 16053: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 15, 2024 వరకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ ఉంటాయి.
- రైలు నెం. 16054: తిరుపతి – డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ అక్టోబరు 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అదనపు కోచ్ లు అందుబాటో ఉంటాయి. పొందుతుంది.
- రైలు నెం. 22616: కోయంబత్తూరు – తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 15, 2024 వరకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ అదనంగా ఉంటాయి.
- రైలు నెం. 22615: తిరుపతి – కోయంబత్తూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్‌తో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు నడుస్తుంది.
- రైలు నెం. 22617: కాట్పాడి – జోలార్‌పేట మీదుగా తిరుపతి – SMVT బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ ఉంటాయి, ఇది అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది.
- రైలు నం. 22618: SMVT బెంగళూరు – తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జోలార్‌పేటై మరియు కాట్పాడి మీదుగా అక్టోబరు 5 నుండి అక్టోబరు 16, 2024 వరకు ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ కోచ్ లను జతచేయనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..