Tuesday, March 4Thank you for visiting

IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..

Spread the love

IOCL Jobs |  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్ట్‌ లకు కంపెనీ సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. . ఐవోసీఎల్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫారమ్‌ ను 19 ఆగస్టు 2024 లోపు స‌మ‌ర్పించాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన విష‌యాలు ఇవీ..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తంగా 400 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించ‌నున్నారు.

  • ట్రేడ్ అప్రెంటీస్,
  • టెక్నీషియన్ అప్రెంటీస్,
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్.

ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీనికి మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ iocl.com కి సంద‌ర్శించాలి. ఇందులో మీరు ఈ నియామకాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలు పోస్టును బట్టి మారుతూ ఉంటాయని గ్ర‌హించాలి..

ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, అతను సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల రెగ్యులర్ ఫుల్ టైమ్ ITI డిప్లొమా కూడా కలిగి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్ట్ కోసం, అభ్యర్థి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి.
కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక IOCL Jobs వయోపరిమితి విష‌యానికొస్తే.. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ చూడాలి. వివిధ దశల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు IOCL అప్రెంటిస్ పోస్ట్‌కు ఎంపిక చేస్తారు. ముందుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వ‌హిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రీ ఎంగేజ్‌మెంట్ మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. అన్ని దశల‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి 12 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాల‌ని గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పోస్ట్‌ల ప్రత్యేకత ఏమిటంటే, దరఖాస్తు కోసం మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టును బట్టి వేత‌నం ఇస్తారు. దీని గురించి సమాచారాన్ని మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న‌ నోటీసును క్షుణ్ణంగా ప‌రిశీలించుకోండి.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version