
India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..
ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది.
ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వారు.. ఇందీపొస్త్గ్ద్సొన్లినె.గొవ్.ఇన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఐతే ఈ జాబ్స్ కోసం అప్లై చేసే వారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. వీటి కోసం ఎస్.సీ, ఎస్.టి లకు మరో ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకూ వయసులో సడలింపు ఉంది. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ, ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి ధరఖాస్తు ఫీజు లేదు. వారు కాకుండా మిగతావారందరికీ కూడా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణాలో ఖాళీలు ఎన్నంటే..
India Postal GDS Recruitment : పోస్టల్ జాబ్స్ లో భాగనా ఏపీలో 656 ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా 454 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పోస్టల్ జాబ్ అంటే ఆసక్తిగల అభ్యర్థులు వీటికి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ వచ్చిన వారికి వారి పోస్ట్ ని బట్టి జీతం ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ కు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ కు 10,000 రూ.24,470 అరకు జీతం ఉంటుంది. ఈ జాబ్ కు రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము, ఆన్ లైన్ దరఖాస్తు ఇలా మూడు దశల్లో ఉంటుంది.
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి.. వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. పాస్ వర్డ్ తో నమోదు చేసుకోవడానికి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. రిజిస్టర్ నెంబర్ జనరేట్ అయ్యాక లాగిన్ అయ్యి ఫీజు కట్టాలి. ఆ తర్వాత ఆసక్తి ఉన్న పోస్ట్ కు అప్లై చేయాలి. ఆ తర్వాత డివిజన్ ఎంపిక చేయాలి. ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి. ఐతే దరఖాసు చేస్తున్న డివిజన్ ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
మెరిట్ ఆధారంగా అభ్యర్ధులు షార్ట్ లిస్ట్ అవుతారు. 10వ తరగతి వచ్చిన మార్కులు ఆధారంగా ఈ మెరిట్ జాబితా ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్ధుల లిస్ట్ జిఈడీఎస్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు. అంతేకాదు మొబైల్ నెంబర్, ఈ మెయిల్ కు వెరిఫికేషన్ వివరాలు పంపిస్తారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..