Friday, May 9Welcome to Vandebhaarath

Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..

Spread the love

Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 ద్వారా విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఒక క్షిపణి వ్యవస్థ. మనపై దాడి మొదలు కాగానే ఆటోమెటిక్ గా యాక్టివ్ అవుతుంది.శత్రు విమానాలను లేదా క్షిపణిని తక్షణమే గాలిలోనే నాశనం చేస్తుంది. భారత సైన్యం ఈ రక్షణ వ్యవస్థకు సుదర్శన చక్రం అని పేరు పెట్టింది, కాబట్టి ఈ సుదర్శన చక్ర (Sudarshan Chakra S-400) శత్రువును ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం.

S-400 క్షిపణి అంటే ఏమిటి?

S-400 క్షిపణి భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థ (air defence system)గా పరిగణిస్తారు. S-400 క్షిపణి వ్యవస్థ ఎలాంటి వైమానిక దాడి నుండైనా సమర్థవంతంగా రక్షిస్తుంది. ఈ క్షిపణిని రష్యాలో తయారు చేశారు దీనిని కొనుగోలు చేయడానికి దాదాపు ఐదు బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2018లో S-400 క్షిపణిని కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతదేశం రష్యా నుంచి ఐదు యూనిట్ల క్షిపణులను కొనుగోలు చేసింది. ఈ క్షిపణి చాలా శక్తివంతమైనది, ఇది అధునాతన యుద్ధ విమానాలను కూడా కూల్చివేసి నాశనం చేయగలదు. ఇది కాకుండా, ఈ క్షిపణి ఒకేసారి 72 మిసైల్స్ ను ప్రయోగించగలదు. దీని శక్తి ఏమిటంటే, పాకిస్తాన్, చైనా భారతదేశంపై దాడి చేయడానికి చేసే ప్రయత్నాలను ఆకాశంలోనే చిత్తు చేయగలదు.

S-400 క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా సులభం. ఎందుకంటే దీనిని 8X8 ట్రక్కులో అమర్చవచ్చు. దీని స్థానం స్థిరంగా ఉండనందున , శత్రువు దీనిని గుర్తించడం చాలా కష్టం. ఈ రక్షణ వ్యవస్థ మైనస్ 50 నుంచి మైనస్ 70 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలలో కూడా పనిచేయగలదు. S 400 శత్రువుల దాడులను 500 కిలోమీటర్ల ముందుగానే ట్రాక్ చేయగలదు. అవి పరిధిలోకి రాగానే వాటిని ఆకాశంలోనే కూల్చివేయగలదు. దీని పరిధి 40, 100, 200 మరియు 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భారతదేశం, చైనా, టర్కీ, సౌదీ అరేబియా మరియు ఖతార్ ఈ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

ఇది S-400 క్షిపణి శక్తి

  • S-400 ప్రపంచంలోనే అత్యుత్తమ వాయు రక్షణ వ్యవస్థ (S-400 Missile System)గా పరిగణించబడుతుంది. రష్యాకు చెందిన అల్మాజ్-ఆంటె ఈ క్షిపణి వ్యవస్థను తయారు చేసింది.
  • S-400 అనేది ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించగల ఒక మొబైల్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, బాంబర్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు) వంటి వివిధ రకాల వైమానిక లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో కూల్చివేస్తేంది.
  • ఇది నాలుగు రకాల క్షిపణులను కలిగి ఉంది. ఇవి 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలవు.
  • S-400 రెండు ప్రత్యేక రాడార్ వ్యవస్థలను కలిగి ఉంది. ఇవి 600 కిలోమీటర్ల దూరం వరకు వైమానిక లక్ష్యాలను గుర్తించగలవు. ఒకేసారి 80 వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలవు.
  • ఒకసారి ఈ వ్యవస్థ యాక్టివేట్ అయిన తర్వాత, సిగ్నల్ అందిన 3 నిమిషాల్లోనే అది కాల్పులకు సిద్ధంగా ఉంటుంది. అంటే శత్రువు దాడి వెంటనే భగ్నం అవుతుంది.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version