Friday, March 14Thank you for visiting

తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య

Spread the love

మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఓ వ్యక్తి తన భోజనం తయారీలో కేవలం రెండే రెండు టమాటాలను తన భార్యకు చెప్పకుండా వండాడు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల భోజనం వండేటప్పుడు నా భార్యను అడగకుండా రెండు టొమాటోలు వాడడంతో మా మధ్య పెద్ద
గొడవ జరిగింది. టొమాటోల వాడకం గురించి అతని భార్య తనను సంప్రదించకపోవడంతో కలత చెందింది. మూడు రోజులు నాతో మాట్లాడలేదు. ’’ అని తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

వాగ్వాదం తర్వాత సంజీవ్ భార్య తమ కుమార్తెతో కలిసి ఇంటిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లిపోయింది. వారిని వెతకడానికి సంజీవ్ ఎంతో ప్రయత్నించాడు కానీ  ఆచూకి లభించలేదు. అనంతరం సహాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ విషయమై సంజీవ్ తమకు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు.
తాను వండుతున్న వెజిటబుల్ డిష్ లో రెండు టమాటాలు వేయడంతోనే వాగ్వాదం మొదలైందని సంజీవ్ తెలిపాడు. మూడు రోజులుగా తన భార్యతో మాట్లాడలేదని, ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పాడు. దీనిపై పోలీసులు స్పందిస్తూ సంజీవ్ భార్యను సంప్రదిస్తామని, ఆమె త్వరలో తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version