
How to Test Flour Purity | కల్తీకి కాదేదీ అనర్హం.. ప్రస్తుతం మార్కెట్ లో అక్రమార్కులు ధనార్జనే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతీ వస్తువును కల్తీ చేసేస్తున్నారు. వంట నూనెలు, పాలు, నెయ్యి, తేనె, పప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందులో గోధుమ పిండి మినహాయింపు కాదు. కల్తీ పిండి (Adulterated Wheat Flour) వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
గోధుమ పిండి, గోధుమ ధాన్యం నుంచి తయారవుతుంది, గోదుప పిండి సాధారణంగా లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. మెషిన్ ద్వారా గ్రౌండ్ చేసిన పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొట్టును కలిగి ఉండదు. అయితే దంచిన గోదుమ పిండి ముతకగా ఉంటుంది, కొంత పొట్టును కలిగి ఉంటుంది. అలాగే ఇది వగరు వాసన కలిగి ఉంటుంది.
గోధుమ పిండిని కల్తీ చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు?
కల్తీల యొక్క అత్యంత సాధారణ రకాలు:
- మైదా లేదా శుద్ధి చేసిన పిండి (Maida or refined flour)
- ఇసుక మరియు ధూళి (Sand and dirt)
- సుద్ద పొడి (Chalk powder)
- ఊక పొడి
- కార్న్‌ఫ్లోర్ లేదా యారోరూట్ పౌడర్ (Cornflour or arrowroot powder)
కల్తీ పిండితో ప్రమాదం ఏమిటి?
వ్యాపారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందడానికి, పండి ఆకర్షణీయంగా కనిపించడానికి గోదుమ పిండిలో హానికరమైన లేదా తక్కువ-నాణ్యత కలిగిన పదార్ధాలను కలపుతారు. ఇది పిండి పోషక విలువలను తగ్గిస్తుంది, ఆరోగ్యానికి హానికరం. సాధారణ కల్తీలు సుద్ద, టాల్కమ్ పౌడర్, రంపపు పొడి, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.
లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?
హానికరమైన పదార్థాలు కలిపిన పిండిని తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి. చాక్ పౌడర్, టాల్కమ్ పౌడర్ వంటి పదార్థాలు పిండిలో పోషకాలను తగ్గిస్తాయి, ఇతర హానికరమైన పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే పిండి కల్తీ అయిందా లేదా అనేది గుర్తించడానికి పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యం.
ఇంట్లో పిండి స్వచ్ఛతను ఎలా పరీక్షించాలి:
How to Test Flour Purity
నిమ్మకాయ పరీక్ష: కొద్ది మొత్తంలో పిండిపై కొన్ని చుక్కల నిమ్మరసం ఉంచండి. అందులో బుడగలు వస్తే ఆ పిండిలో సుద్ద పొడి ఉన్నట్లు గుర్తించాలి. స్వచ్ఛమైన పిండి నిమ్మరసంతో బుడగలు ఉత్పత్తి చేయదు.
నీటి పరీక్ష: ఒక గ్లాసు నీటిలో పిండిని కలపండి. తేలియాడే కణాలు ఉన్నట్లయితే, పిండి ఊకతో కల్తీ చేయబడి ఉండవచ్చు. స్వచ్ఛమైన గోధుమ పిండి పూర్తిగా కలిసిపోతుంది, నీరు స్పష్టంగా ఉంటుంది.
రుచి పరీక్ష: పచ్చి పిండిని కొంచెం రుచి చూడండి. కల్తీ పిండి సాధారణంగా రసాయనాలు జోడించడం వల్ల చేదుగా ఉంటుంది. స్వచ్ఛమైన పిండిలో ఈ చేదు ఉండదు.. రుచిగా ఉంటుంది.
HCL టెస్ట్: పిండి నీటి మిశ్రమాన్ని సిద్ధం చేయండి, ఆపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొన్ని చుక్కలను వేయండి. మిశ్రమంలో పసుపు కాగితాన్ని ఉంచండి. ఎరుపు రంగు బోరిక్ యాసిడ్ ఉనికిని సూచిస్తుంది, అయితే స్వచ్ఛమైన పిండి కాగితం రంగును మార్చదు.
లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.