
How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్ వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా, నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది.
How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు ఇతర UPI యాప్‌లకు సమానంగా ఉంటాయి. మీరు PhonePeలో మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసుకోండి.
- స్టెప్ 1: మీ UPI యాప్‌కి వెళ్లండి.
- స్టెప్ 2: ఎగువన ఎడమ వైపు కార్నర్ లో ఉన్న మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: Payment Management విభాగం కింద మొదట Auto Pay అనే ఆప్షన్ ఉంటుంది.
- స్టెప్4: దానిపై క్లిక్ చేయండి.. మీరు Autopay కు యాక్సెస్ ఉన్న సర్వీస్ ల లిస్ట్ మీకు కనిపిస్తుంది.
- స్టెప్ 5: మీరు ఆటోపేను Pause చేయాలనుకుంటే ఆ సర్వీస్ పై క్లిక్ చేసి, ఆపై ‘Pause’ చేయండి. మీరు క్రిందికి స్క్రోల్ చేసి, ‘డిలీట్ ఆటోపే’పై ట్యాప్ చేయడం ద్వారా కూడా ఆటో పేని తొలగించవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో ఒక అనివార్యంగా మారిపోయాయి. అవి ఇకపై కేవలం కాల్‌లు చేయడానికి, సందేశాలు పంపడానికి మాత్రమే కాకుండా డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ కోసం కూడా ఉపయోగిస్తుంటారు. స్మార్ట్‌ఫోన్‌లు డాక్యుమెంట్‌లు, ఫోటోలు, యాప్‌లు, సోషల్ మీడియా వివరాలు, లొకేషన్ డేటా వంటి వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తాయి.
ఈ సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళితే, అది మోసానికి దారి తీస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలోని అనేక యాప్‌లు ఆపరేట్ చేయడానికి నిర్దిష్ట పర్మిషన్స్ అవసరం. ఈ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా, అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఆపకుండా కొనసాగించవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ ఫర్మిషన్స్ ను వెంటనే సమీక్షించడం చాలా కీలకం. మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్ అనుమతులను తరచూ చెక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..