Thursday, March 13Thank you for visiting

HMPV Vrius | దేశంలోకి ప్రవేశించిన HMPV వైరస్

Spread the love

HMPV virus Alert : బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చైనాలో ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలకు కారణమైన వైరస్ ను భారతదేశంలో మొదటిసారిగా గుర్తించారు.

చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, కర్నాటక ఆరోగ్య అధికారులు ఈ శ్వాసకోశ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను ప్రభావితం చేస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం, సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి చర్యలు చేపట్టాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. ట‌వ‌ల్‌, చేతి రుమాళ్ల‌ వంటి వ్యక్తిగత వస్తువులను ఇత‌రుల‌తో షేర్ చేసుకోవ‌ద్దు. ప్రజలు హైడ్రేటెడ్‌గా ఉండాలని, పౌష్టికాహారం తినాలని, వైద్యుల స‌ల‌హాలు లేకుండా సొంతంగా మెడిసిన్ వాడొద్ద‌ని కోరారు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నియంత్రించాలని. ముఖాన్ని తాకడాన్ని తగ్గించాలని. జ్వరం, దగ్గు లేదా తుమ్ము లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

భయపడాల్సిన అవసరం లేదు.. : కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా

దేశంలోకి ప్ర‌వేశించిన హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కొత్తది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2001లో గుర్తించిన ఈ వైరస్‌ (HMPV virus) పట్ల‌ ఆందోళన చెందాల్సిన ప‌ని లేదన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు శిశువులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక చిన్నారి, పశ్చిమ బెంగాల్‌లో ఒకరికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కరోనా మ‌హ‌మ్మారిలా చైనాను బెంబేలెత్తిస్తున్న ఈ వైరస్ భార‌త్ లోకి వ్యాపించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి లాక్‌డౌన్‌ పరిస్థితికి దారి తీయవచ్చన్న టెన్ష‌న్ మొద‌ల‌వుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version