
Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్తల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మరో సంచలన ప్రకటన చేసింది. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ వర్గాల వరకు హిండెన్ బర్గ్ నివేదిక కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ షేర్లన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ సంస్థ రిపోర్ట్ భారత స్టాక్ మార్కెట్లను కూడా షేక్ చేసింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది.
తమ కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) ప్రకటించడం ఇప్పుడు సంచనలంగా మారింది. సంస్థ మూసివేత గురించి తన సన్నిహితులతో గతంలోనే చర్చించినట్లు వెల్లడించారు. అనేక సమీక్షల తర్వాత సంస్థను షట్‌డౌన్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలిపారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత వెనుక తమకు ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలూ లేవని తెలిపారు. తమ ప్రణాళికలు, ఐడియాలు ముగియడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అండర్సన్ తన కాబోయే భార్య, బిడ్డతో సమయం గడపడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు కోసం వారికి కావల్సినంత డబ్బు సంపాదించానని చెప్పాడు. అతను తన డబ్బును ఇండెక్స్ ఫండ్స్, ఇతర తక్కువ రిస్క్‌గల పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పాడు.
తమ సంస్థలోని కొందరు వారి స్వంత పరిశోధనా సంస్థను ప్రారంభించబోతున్నారని, వాటిలో తన వ్యక్తిగతంగా తన ప్రమేయం లేకుండా నేను వారికి బహిరంగంగా ప్రోత్సహిస్తానని తెలిపారు . మా బృందంలో ఇప్పుడు ఉచిత ఏజెంట్లుగా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మీరు తెలివైన, ఏకాగ్రతతో పని చేసే వారు అవసరం ఉంటే తనను సంప్రదించడానికి సంకోచించకండి అని నాథన్ అండర్సన్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..