
Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్రసారమవుతాయి.
హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎప్పుడు ఎక్కడ?
యాక్సిస్ మై ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి హర్యానా, J&K ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తుంది. జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, CSDS, C ఓటర్స్‌తో సహా ఇతర పోల్‌స్టర్‌లు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా ఎన్నికల్లో విజేతలను అంచనా వేయడానికి నిర్వహిస్తారు. ఓటర్ల నుంచి తీసుకున్న సర్వేల ద్వారా అభ్యర్థుల జయాపజయాలపై ఒక అంచనాకు వస్తారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన తర్వాత పోల్స్ విడుదల చేస్తారు. ఎగ్జిట్ పోల్‌లు విజేతలను అంచనా వేయడమే కాకుండా, ఎన్నికలకు సంబంధించిన అనేక ఇతర అంశాలను కూడా అంచనా వేస్తాయి, అవి పోలింగ్ కారకాలు, వివిధ వయసుల వారు ఎలా ఓటు వేసి ఉండవచ్చు తదితర అంశాలను వెల్లడిస్తారు.
Exit Polls 2024 live | J&Kలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తుండగా, బీజేపీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. హర్యానాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హర్యానాలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రచారంలో ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. అయితే హర్యానా ప్రజలు కాంగ్రెస్‌ను ఉటంకిస్తూ అవినీతి పార్టీకి ఓటు వేయరని, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..