Friday, March 14Thank you for visiting

ఆ ఊరిలో యూట్యూబర్స్ కోసం అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేసిన ప్రభుత్వం… రూ.లక్షల్లో సంపాదిస్తున్నయవత..

Spread the love

ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్లదే హవా.. ఏదో సరదాకు వీడియోలు తీయడం కాకుండా.. అదే ప్రధాన ఉపాధిగా ఎంచుకుంటూ ఎంతో మంది విజయం సాధిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో ఓ ప్రత్యేక గ్రామం ఉంది. ఆ ఊరికి వెళ్తే అడుగడుగునా యూట్యూబర్లే కనిపిస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని తులసి అనే గ్రామం యూట్యూబర్లకు ప్రసిద్ధి చెందింది. 10వేల జనాభా గల ఈ గ్రామంలో ప్రతీ వీధిలో ఇద్దరో ముగ్గురో యూట్యూబర్లు ఉన్నారు.

రాయ్‌పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఈ తులసి గ్రామం ఉంది. ఈ గ్రామంలో 1100 మంది యూట్యూబర్‌లు ఉన్నారు. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుకుగా ఉంటున్నారు. అయితే యూట్యూబ్ లో అద్భుతమైన కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యువతను ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

తులసి గ్రామంలో కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సాహకంగా జిల్లా యంత్రాంగం ఆధునిక పరికరాలతో  కూడిన స్టూడియోను ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో ప్రత్యేక వయస్సు గల యూట్యూబర్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటారని రాయ్‌పూర్ కలెక్టర్ సర్వేశ్వర్ నరేంద్ర భూరే (Dr. Sarveshwar Narendra Bhure) తెలిపారు. ఈ యూట్యూబర్లకు పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారని, వీరి వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయని కలెక్టర్ తెలిపారు.

“గ్రామ విశిష్టత గురించి తెలుసుకున్న తర్వాత, మేము తులసిని సందర్శించాము. ఆధునిక పరికరాలు కలిగిన స్టూడియో లేకపోవడంతో యూట్యూబర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాం. వీరి సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే వారిని మరింత చైతన్యవంతులను చేసేందుకు జిల్లా యంత్రాంగం ‘హమర్ ఫ్లిక్స్’ (Hamar Flix ) అనే స్టూడియోను ఏర్పాటు చేసిందని కలెక్టర్ భూరే తెలిపారు. ” ఈ స్టూడియో యూట్యూబర్‌లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోంది. వీడియోలను ఎడిటింగ్, అప్‌లోడ్ చేసేటప్పుడు యూట్యూబర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుంది” అని కలెక్టర్ చెప్పారు.

గ్రామంలోని యూట్యూబర్‌లు కేవలం వినోదాత్మక వీడియోలను మాత్రమే రూపొందించడం లేదని, వారు విద్యాపరమైన, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరమైన విలువైన సమాచారాన్ని వీడియోల ద్వారా అందిస్తున్నారని ఆయన వివరించారు. కాగా ‘హమర్ ఫ్లిక్స్’ తరహాలో జిల్లాలోని ఇతర గ్రామాల్లోనూ ఇలాంటి స్టూడియోలను నెలకొల్పాలని యంత్రాంగం యోచిస్తోంది.

Hamar Flix Studio లో అత్యాధునిక కెమెరాలు, వైఫై

గ్రామ తులసి స్టూడియోలో అవసరమైన పరికరాలు, ఆధునిక కెమెరాలు, డ్రోన్ కెమెరా, కంప్యూటర్లు,  సాఫ్ట్‌వేర్ (ఎడిటింగ్ మిక్సింగ్ కోసం)తోపాటు ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఈ స్టూడియోను మరింత విస్తరించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ స్టూడియో ఏర్పాటుతో, క్రియేటర్లు ఇప్పుడు మంచి క్వాలిటీ వీడియోలను రూపొందించగలుగుతున్నారని, క్రియేటర్ల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు, వారిని చైతన్యవంతం
చేసేందుకు ఈ స్టూడియో ఉపయోగపడుతుందని టిల్డా జనపద్ సీఈవో వివేక్ గోస్వామి తెలిపారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యక్తులు మంచి కంటెంట్‌ ను అందిస్తున్నారని, వారిలో కొందరుడిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాగా సంపాదిస్తున్నారని అధికారి తెలిపారు.

భవిష్యత్తులో, అడ్మినిస్ట్రేషన్ కంటెంట్ సృష్టికర్తల శిక్షణ కోసం అన్ని సౌకర్యాలతో ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేస్తుందని అధికారి వివరించారు. త్వరలో పరిపాలన ‘డిజిటల్ స్కిల్ సెంటర్’ (DMF )ను అభివృద్ధి చేస్తుంది, దీనిలో యువత డిజిటల్ మార్కెటింగ్ (Digital Marketing), గ్రాఫిక్స్ డిజైన్(Graphics Design), SEO (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్) ఇతర వాటి గురించి నేర్చుకుంటారు.

కాగా ప్రముఖ యూట్యూబర్ జై వర్మ.. అతని స్నేహితుడు జ్ఞానేంద్ర మొదట 2016లో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఛత్తీస్‌గఢిలోని స్థానిక మాండలికంలో కామెడీ వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా, గ్రామస్తులు కూడా వారి ప్రయాణంలో వీరిద్దరికి మద్దతు ఇచ్చారు.అత్యుత్తమ కంటెంట్ కలిగిన వీడియోలతో వీరు క్రమంగా ఎదిగారు. వీరిద్దరి విజయాన్నిస్ఫూర్తిగా తీసుకొని ఇతర గ్రామస్తులు కూడా యూట్యూబ్ చానళ్లను ప్రారంభించారు. ప్రజలు ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ‘హమర్ ఫ్లిక్స్’ స్టూడియోను స్థాపించడంపై జె.వర్మ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. Hamar Flix Studio Tulsi village

అంతకుముందు, వీడియోలను అప్‌లోడ్ చేయడంతో పాటు ఎడిటింగ్ టాస్క్‌లో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు. స్టూడియో స్థాపనతో గ్రామంలోని 30-40 మంది యూట్యూబర్‌లకు ఎంతో డబ్బులు ఆదా అవుతున్నాయని తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version