Saturday, April 19Welcome to Vandebhaarath

Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Spread the love

Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్‌ లిస్ట్ ఇదే..

Global NCAP safest cars:  కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు.

అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు చెందిన హారియర్, సఫారీ, వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన వర్టస్, టైగన్, స్కోడా కంపెనీకి చెందిన స్లావియా, కుషాక్ .. అలాగే హ్యుందాయ్ వెర్నాకార్లు టాప్ క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి.

టాటా హారియర్ Tata Harrier

టాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), హారియర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 5-సీటర్ SUV అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 5 స్టార్ రేటింగ్‌లను పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం నాలుగు స్టార్‌లను పొందింది.

టాటా సఫారి Tata Safari 

టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరొక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), సఫారి..  గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు  పిల్లల భద్రత కోసం అత్యధిక స్కోర్‌లను సాధించింది. హారియర్, సఫారీ ఇద్దరూ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లకు 33.05 పాయింట్లను అందుకున్నాయి.

హ్యుందాయ్ వెర్నా Hyundai Verna

కొత్తగా ప్రారంభించబడిన హ్యుందాయ్ వెర్నా పెద్దలు, పిల్లల భద్రత కోసం గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. సెడాన్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లలో 28.18 పాయింట్లు, అలాగే పిల్లల రక్షణ కోసం 49 పాయింట్లకు 42 పాయింట్లు సాధించింది.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ Volkswagen Virtus

వోక్స్‌వ్యాగన్ వర్టస్ GNCAP చరిత్రలో అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. సెడాన్ గ్లోబల్ NCAP కింద పెద్దలు పిల్లల ఆక్యుపెంట్ రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్ పొందింది.

స్కోడా స్లావియా Skoda Slavia

స్కోడా స్లావియా పెద్దలు పిల్లల రక్షణలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ స్కోడా సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 10.89 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర) వద్ద అందుబాటులో ఉంది.

వోక్స్వ్యాగన్ టైగన్ Volkswagen Taigun

టైగన్ రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది – డైనమిక్ లైన్ 1.0 L TSI  అలాగే 1.5 L TSI EVO విత్ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ (ACT).. గ్లోబల్ NCAP ప్రకారం, టైగన్ పెద్దల కోసం 5 స్టార్, పిల్లల రక్షణ కోసం 5 స్టార్  రేటింగ్ సాధించింది.

స్కోడా కుషాక్ Skoda Kushaq

స్కోడా కుషాక్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్‌లను సాధించింది. కుషాకిస్ 1.0/1.5 TSI ఇంజిన్‌తో వస్తుంది. దీని  ప్రారంభ ధర రూ. 10.89 లక్షలతో వస్తుంది.


Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు,

ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version