
Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో ప్రత్యేకంగా ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌పై గ్రేట్ డీల్స్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఆపిల్ ఐఫోన్ 15 ధర ప్రస్తుతం రూ. 69,900 ఉంది. ఈ ధరను ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీగా తగ్గించనుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, 15 ప్రొ, 15 ప్రొ మ్యాక్స్ సహా అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్లపై ఎంత వరకు డిస్కౌంట్లు ఉంటాయనే వివరాలను వెబ్‌సైట్ ఇప్పటివరకూ వెల్లడించలేదు. డిస్కౌంట్ల గురించి ఈ-కామర్స్ దిగ్గజం సెప్టెంబర్ 23న ప్రకటించనుంది. గత ఏడాది విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ ఈ సేల్‌లో అతి తక్కువ ధరలో విక్రయానికి అందుబాటులోకి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఐఫోన్ 16 తరహాలోనే ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ వంటి మోడల్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను పొందుతాయి. 15 ప్రో మోడల్స్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ రానుంది. మరోవైపు ఐఫోన్ 15 ప్రొ, ప్రొ మ్యాక్స్ కూడా నిలిపివేసినందున మిగిలిన డివైజ్‌లను అందుబాటు ధరలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15 సిరీస్ ఏ16 బయోనిక్ చిప్ సెట్‌తో మల్టీ టాస్కింగ్, ఇన్‌స్టంట్ యాప్ లోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఐఫోన్లతో అద్భుత వీడియో రికార్డింగ్ సౌకర్యంతో పాటు మీరు ఓ మొబైల్ గేమర్ లేదా యూట్యూబ్ క్రియేటర్ అయితే ఐఫోన్ 15 సిరీస్ ప్రాసెసింగ్ పవర్ మీ కలలను సాకారం చేస్తుంది. ఇక ఐఫోన్ 16 సిరీస్ లేటెస్ట్ 18 చిప్‌సెట్‌తో ఇటీవలే విడుదల చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..