
EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ పై కాంగ్రెస్ తోపాటు పలు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదును సర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వరుస పరిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయన దారులను సుగమం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే.
2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అప్పటి సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. జ్ఞాన్‌వాపికి సంబంధించి 2023 ఆగస్టు 4న సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మసీదును ఆలయాన్ని కూల్చివేసి నిర్మించారా లేదా అన్నది స్పష్టం చేయడమే తమ ఉద్దేశమని తీర్పును వెలువరిస్తూ కోర్టు పేర్కొంది.
శివసేన పక్షనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని అజ్మీర్ అయినా, సంభాల్ అయినా.. దేశానికి నిప్పుపెట్టి సీజేఐ చంద్రచూడ్ పదవీ విరమణ చేశారని, ఈరోజు దేశ పరిస్థితికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందని, దానికి జస్టిస్ చంద్రచూడ్ బాధ్యత వహించాలని అన్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ.. చంద్రచూడ్ ద్వారా బీజేపీ పూర్తి రాజకీయ లబ్ధి పొందుతోంది. మత ఉద్రిక్తత ప్రతిచోటా వ్యాపిస్తోంది. అని అన్నారు.
జ్ఞనవాపి మసీదుపై పిటిషన్ ను దిగువ కోర్టు అంగీకరించగా దీనిని సవాల్ చేస్తూ.. ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రార్థనా స్థలాల చట్టం దృష్ట్యా అలాంటి పిటిషన్ ను స్వీకరించలేమని కోర్టు తెలిపింది. ఈక్రమంలో మథురలోని షాహీ ఈద్గా, లక్నోలోని తిలా వలీ మసీదు, ఇప్పుడు యూపీలోని సంభాల్‌లో జామా మసీదు, అజ్మీర్ షరీఫ్ దర్గాలో కూడా సర్వే చేయాలంటూ కోర్టుకు పిటిషన్లు అందాయి.