Monday, March 3Thank you for visiting

Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

Spread the love

Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ త‌న ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త‌మ వ‌ద్ద కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసులో ఈనెల 11న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం కంప్లయన్స్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తన అఫిడవిట్లో పేర్కొంది.

ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవీ..
ఎస్బీఐ దాఖలు చేసిన కంప్లయన్స్ అఫిడవిట్ ప్రకారం..
2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వ‌ర‌కు మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) కొనుగోలు చేసిన‌ట్లు పేర్కొంది.
2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య కాలంలో మొత్తం 18,871 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, అందులో 20,421 ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేశారు.
మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశామని, అందులో 22,030 ఎలక్టోరల్ బాండ్లను రీడీమ్ చేశామని ఎస్బీఐ బుధవారం త‌న అఫిడవిట్లో పేర్కొంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version