Monday, March 3Thank you for visiting

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్, ప్రారంభం.. ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి.. స్టైఫండ్ ఎంత? పూర్తి వివరాలు ఇవే..

Spread the love

PM Internship Scheme | యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలను మెరుగురిచేందుకు కేంద్రంలోని మొదీ ప్రభుత్వం  పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)ను గురువారం  ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ అందించనుంది.  దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల ఖర్చుతో 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన యువతీయువకులు మంచి అవకాశాలు దక్కించుకొనే చాన్స్ ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి, 21 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు అని వర్గాలు తెలిపాయి.

ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ను  కేంద్ర బడ్జెట్‌ 2024లోనే కేంద్రం ప్రకటించింది. అందుకు నుగుణంగా అగ్రశ్రేణి కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme) ప్రారంభించారు. అభ్యర్థులు అక్టోబర్‌ 12 నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 2నుంచి  ఈ ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రారంభమవుతుంది.

నెలకు స్టైఫండ్‌ ఎంత?

ఈ పథకంలో కంపెనీలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయి 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరవచ్చు. ఇంటర్న్‌షిప్‌ వ్యవధిలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.5వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తారు. ఇందులో కేంద్రం రూ.4,500 ఇవ్వగా.. మరో రూ.500లు ఆయా కంపెనీలు తమ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి చెల్లించుతాయి. అలాగే, ఈ పథకం కింద ఇంటర్న్‌ల శిక్షణకు సంబంధించిన ఖర్చులను కంపెనీలే భరించాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు బీమా సౌకర్యం

ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా అందిస్తారు. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా అభ్యర్థులకు బీమా సౌకర్యం కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అర్హులు వీరే..

కొన్ని షరతులు, నిబంధనలకు లోబడి 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ స్కీమ్ కు  అర్హులు. ఎస్‌ఎస్‌సీ పాసైనవారితో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి కుటుంబాలకు చెందిన వారితో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగిన వారు ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. .

దరఖాస్తు ఎలా?

అర్హత గల అభ్యర్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు, అక్కడ వారి వివరాలు రెజ్యూమ్‌ను రూపొందించడానికి ఉపయోగించబడతాయి. ఆయా కంపెనీలు ఇచ్చే అవకాశాలను బట్టి అభ్యర్థులు తమ ప్రాధాన్య రంగాలు, పాత్రలు, స్థానాల ఆధారంగా ఇంటర్న్‌షిప్‌లను బ్రౌజ్ చేయవచ్చు, గరిష్టంగా ఐదు అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవకాశాలను బట్టి అక్టోబర్‌ 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, అభ్యర్థుల ఎంపికను మరింత పారదర్శకంగా చేసేలా పోర్టల్‌ రూపొందించారు. భాగస్వామి కంపెనీలు పోర్టల్‌లో ప్రత్యేక డాష్‌ బోర్డ్‌లు ఉంటాయి. వీటి ద్వారానే ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను పోస్ట్‌ చేస్తుంటారు. లొకేషన్‌, శిక్షణ ఇచ్చే విభాగం, అర్హతలు, అభ్యర్థులకు అందించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరాలను పొందుపరుస్తాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ప్రాధాన్య రంగాలను ఎంచుకొని పోర్టల్‌లోనే రిజిస్టర్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత తమ దరఖాస్తుల స్టేటస్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు.

అభ్యర్థులకు సహాయం చేయడానికి కేంద్రం కాల్ సెంటర్ ప్రారంభించింది ఇప్పటివరకు కేంద్రానికి ఫోన్ చేసిన వారిలో 44 శాతం గ్రాడ్యుయేట్లు, 13 శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 11 శాతం మంది 12వ తరగతి ఉత్తీర్ణులు, 12వ తరగతి ఉత్తీర్ణులు డిప్లొమా 3 శాతం, 10వ తరగతి ఉత్తీర్ణులు 3 శాతం, 8వ తరగతి ఉత్తీర్ణులు 1 శాతం ఉన్నారు.

ఫార్మా మేజర్ అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు అలాగే మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గురువారం ఉదయం నాటికి ఇప్పటికే ఇంటర్న్‌ల కోసం 1,077 ఖాళీలను ఉంచింది. ఈ పథకం కోసం ఇప్పటికే 111 కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version