Saturday, April 19Welcome to Vandebhaarath

Durg to Visakhapatnam Vande Bharat | వైజాగ్ నుంచి కొత్త వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. ఈ రైలు టైమింగ్స్‌, హాల్టింగ్ స్టేష‌న్లు…

Spread the love

Durg to Visakhapatnam Vande Bharat | ఏపీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌యాణించేవారికి శుభ‌వార్త‌.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది దుర్గ్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తుంది. ఇకపై రాజధాని రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకు 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణికులు కేవలం 5 గంటల్లోనే చేరుకోనున్నారు. ఇందుకోసం రైల్వే బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఇది డిసెంబర్ 2022 నుండి శనివారాలు మినహా వారానికి ఆరు రోజులు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ మధ్య ఈ రైలు సేవ‌లందిస్తోంది.

దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు మార్గం

బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందేభారత్ తర్వాత మ‌రో రెండో రైలును కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. సెప్టెంబర్ 15 న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో కొత్త‌గా 10 వందే భారత్ రైళ్ల‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో ఛత్తీస్‌గఢ్ కు కూడా ఒక రైలును కేటాయించారు. దుర్గ్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త వందే భారత్ రైలు రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్, ఖరియార్ రోడ్, టిటిలాగఢ్, ఒడిశాలోని రాయ్‌గఢ్. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ‌ప‌ట్నానికి య్ నగర్‌లో ఆగుతుంది.

దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ రైలు టైమ్ టేబుల్

Durg to Visakhapatnam Vande Bharat Time Table :  ఈ రైలు దుర్గ్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బ‌య‌లుదేరి రాత్రి 11.50 గంటలకు తిరిగి కోటకు చేరుకుంటుంది. . కొత్త వందే భారత్ రైలు శుభ్రపరచడం నిర్వహణ పనుల‌న్నీ దుర్గ్ రైల్వే స్టేషన్‌లోని కోచింగ్ యార్డ్‌లో జరుగుతుంది.

వందే భారత్ రైలు ర్యాక్ 10 లేదా 11 కోచ్ ల‌ను క‌లిగిఉండ‌వ‌చ్చు. వందే భారత్ రైలు చైర్ కార్ గా ఉంటుంది. అందులో స్లీపర్ కోచ్ లు ఉండ‌వు. కొత్త వందే భారత్ రైలు రాయ్‌పూర్‌కు బదులుగా దుర్గ్ నుంచి నడుస్తుంది. ఇక్కడ కోచింగ్ యార్డ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రైలు ఆగే స్టేషన్లలో ఛార్జీ ఎంత ఉంటుంది? ప్రస్తుతానికి దీని అధికారిక సమాచారం రైల్వే శాఖ అందించ‌ల‌లేదు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version