Monday, March 3Thank you for visiting

Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్ట‌మొద‌టి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం

Spread the love

బెంగళూరు వాసులకు శుభవార్త.. సిలికాన్ సిటీలో మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double Decker Flyover ) వాహనాల కోసం ఈరోజు జూలై 17న ‘ట్రయల్ రన్’ ప్రారంభమైంది. ఫ్లైఓవర్‌కు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ గత నెలలో పూర్తయింది. రాగిగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు 3.36 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరు మెట్రోలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రారంభించారు.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఈ వినూత్న మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, నగర ప్రయాణీకులకు జీవనాధారమైన సెంట్రల్ సిల్క్ బోర్డు మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది. డబుల్ డెక్కర్ డిజైన్‌లో ఒక ప్రత్యేకమైన వెహికల్ ఫ్లైఓవర్ నేలకు 8 మీటర్ల ఎత్తులో ఉంది, మెట్రో ఎల్లో లైన్ 16 మీటర్ల ఎత్తులో ఉంది.

డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా రాగిగడ్డ నుంచి వచ్చే వాహన వినియోగదారులు A ర్యాంప్‌ మీదుగా హోసూరు రోడ్డుకు, C ర్యాంప్‌ మీదుగా హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌కు చేరుకుంటారు. ఇంకా, గ్రౌండ్ లెవల్‌లో ఉన్న రాంప్ B, ఔటర్ రింగ్ రోడ్ హోసూర్ రోడ్‌లకు వెళ్నులడానికి BTM వైపు నుంచి రాంప్ A ని కలుపుతుంది. ఇదిలా ఉండగా, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ నుంచి వచ్చే వాహనదారులు రాంప్ D మరియు ఎల్లో లైన్ మెట్రో లైన్‌కు ఎగువన ఉన్న ర్యాంప్ D ద్వారా రాగిగడ్డ వైపునకు చేరుకోవచ్చు. బిటిఎమ్ లేఅవుట్‌ను యాక్సెస్ చేయడానికి డౌన్ ర్యాంప్ Eతో కొనసాగుతుంది. ర్యాంప్ A, ర్యాంప్ B రెండూ అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి (NH-44) మీదుగా ఇప్పటికే ఉన్న మడివాలా ఫ్లైఓవర్‌ కు అనుసంధానమై ఉంది.  రాగిగడ్డ నుంచి సీఎస్‌బీ జంక్షన్‌ వరకు ఎల్లో లైన్‌ కోసం రోడ్డు ఫ్లైఓవర్‌ మొదటి శ్లాబ్ ఇప్పటికే నిర్మించారు. BMRCL ప్రకారం, A, B, C ర్యాంప్‌ల నిర్మాణం మే 2024 నాటికి పూర్తి కావాల్సి ఉండగా, D, E ర్యాంప్‌లను డిసెంబర్ 2024 నాటికి ప్రారంభించాలని నిర్ణయించారు.

రోజువారీ ట్రాఫిక్ 24,000 కార్లు, భారీ వాహనాలతో సహా 46,000 వాహనాలకు మించి ఉండటంతో, ఫ్లైఓవర్ అందుబాటులోకి వ‌స్తే సమయం ఆదా తోపాటు అద్భుత‌మైన జ‌ర్నీ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీ, HSR లేఅవుట్, BTM లేఅవుట్ వైపు వెళ్లే ప్రయాణికులకు అన‌కూలంగా ఉంటుంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version