
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంతమవుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు.
మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీలను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది హత్యకు గురయ్యారు.
“వారు ఇకపై బందీలుగా ఉండరు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్లను కాపాడాలని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చారు తమవారిని కాపాడాలంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు.
నేను పదవి బాధ్యతలు చేపట్టడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. మిడిల్ ఈస్ట్‌లో మొత్తం నరకం విరిగిపోతుందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు బందీలను విడుదల చేయడంలో సాధించిన పురోగతికి మధ్యప్రాచ్యంలో తన ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్‌కాఫ్‌ను కూడా ఆయన అభినందించారు.
హమాస్‌కు ట్రంప్ (Donald Trump) అల్టిమేటం
డోనాల్డ్ ట్రంప్ గాజాలో ఉన్న బందీలను విడుదల చేయడంపై హమాస్‌కు గత డిసెంబరులోనే అల్టిమేటం జారీ చేశారు.అతను తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించే సమయానికి బందీలను విడుదల చేయకపోతే, పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో, ట్రంప్ ఇలా వ్రాశారు, “మిడిల్ ఈస్ట్‌లో చాలా హింసాత్మకంగా, అమానవీయంగా మారింది. మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతిని గురిచేసేలా హమాస్ అమాయకులను బందీలుగా చేసింది. జనవరి 20, 2025లోపు నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే నాటికి బందీలందరినీ విడుదల చేయాలి. మిడిల్ ఈస్ట్‌లో మానవాళికి వ్యతిరేకంగా ఈ దురాగతాలకు పాల్పడిన బాధ్యులు నరకం చూస్తారు అని హెచ్చరించారు.
స్పందించిన ఇజ్రాయెల్
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతించారు. అతను X లో ఇలా రాశాడు, “ధన్యవాదాలు.. మిస్టర్ డొనాల్డ్ ట్రంప్.. మేం మా సోదరీమణులు, సోదరులను చూసే క్షణం కోసం మనమందరం ప్రార్థిస్తున్నాము! అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..