
Dera Baba : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim) తోపాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. 2002లో జరిగిన ఓ హత్య కేసులో వీరు నిర్దోషులని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం (Supreme Court) ఈ మేరకు స్పందించింది. రామ్ రహీమ్ సింగ్‌తోపాటు నలుగురిని సమాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది.
అత్యంత వివాదాస్పద కేసు
డేరా సచ్చా సౌదా (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై 2002లో నమోదైన హత్య కేసు చర్చనీయాంశమైంది. అత్యంత వివాదాస్పద కేసుల్లో ఇదొకటి. ఇది డేరా సచ్చా సౌదా సంఘానికి చెందిన మాజీ మేనేజర్ రంజీత్ సింగ్ హత్యకు సంబంధించింది. డేరా సంస్థలో రంజీత్ సింగ్ కీలక పాత్ర పోషించే వారు. డేరాలో ఉన్న అవకతవకలపై ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారని, ఈ క్రమంలోనే సంస్థ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.
2002లో మేనేజర్ హత్య .. సీబీఐ విచారణ
డేరా వ్యవహారాలకు సంబంధించిన కొన్ని రహస్య సమాచారాలు బహిర్గతం కావడంతో ఇది రంజీత్ సింగ్ పనే అని గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే రంజీత్ సింగ్ హత్యకు గురయ్యారు. 2002లో ఆయన్ను హర్యానాలోని సిర్సా సమీపంలో కాల్చి చంపేశారు. ఈ హత్యలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2003లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణను ప్రారంభించింది.
హైకోర్టు నిర్దోషులని పేర్కొనడంతో..
రంజీత్ సింగ్ హత్యలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందంటూ
అనేక సాక్ష్యాధారాలను సేకరించిన సీబీఐ వాటిని పంజాబ్- హర్యానా హైకోర్టు (Punjab and Haryana High Court)కు సమర్పించింది. వాదోపవాదాల అనంతరం 2024లో హైకోర్టు తీర్పును వెలువరిస్తూ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తోపాటు మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల వారిని దోషులుగా పరిగణించలేమని పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును సీబీఐ సవాలు చేస్తూ 2024 మే 28న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తోపాటు మరో నలుగురికి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..