Tuesday, March 4Thank you for visiting

dengue Fever: దోమలతో నిండిన బ్యాగ్‌ తో ఆస్పత్రికి.. షాకైన.. డాక్టర్లు, సిబ్బంది..

Spread the love

Dengue Fever: పశ్చిమబెంగాల్ లో ఓ ఆసక్తికగర ఘటన చోటుచేసుకుంది. మంగళ్‌కోట్‌లోని ఖుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి దోమలతో నిండిన కవర్ ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సుమారు 25 నుండి 30 దోమలను సేకరించి, ఆ ప్రాంతంలో డెంగ్యూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనతో పాలిథిన్ సంచిలో ఆసుపత్రికి తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు.

ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ.. మొదట ఆ వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీతో వచ్చాడని భావించారు. అయితే కవర్ లో దోమలను చూసి ఆయనతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్సూర్ పరిస్థితిని వివరిస్తూ, ” నా దుకాణం చుట్టూ మురుగు నీరు నిలిచి ఉంది. అక్కడ విపరీతంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుకాణం వద్ద మాకు తీవ్రమైన దోమలు, విషకీటకాల సమస్య ఉంది అని వివరించాడు. “నన్ను నేను రక్షించుకోవడానికి దోమల సమస్యను పరిష్కరించడానికి, నేను కొన్ని దోమలను పాలిథిన్ సంచిలో పట్టుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాను అని చెప్పాడు. డాక్టర్ గారు.. దోమలను పరీక్షించి సరైన చికిత్స అందించగలరు.” అని అడిగాడు..
తన ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని కోరాడు.

ఈ ఘటనపై మంగళకోటే పంచాయతీ సమితి మత్స్య అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (BMOH), బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఈ ప్రాంతంలో దోమల సమస్య నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాగే నిలిచిపోయిన నీటిని తొలగించి, దోమల నివారణ మందులు, బ్లీచింగ్‌ పౌడర్‌ పంపిణీ చేయాలన్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version