Friday, March 14Thank you for visiting

Delhi Ganesh | చిత్రసీమలో విషాదం.. ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మృతి

Spread the love

Delhi Ganesh Death |  ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు నవంబర్ 10న జరగనున్నాయి. ఆగస్ట్ 1, 1944లో జన్మించిన ఢిల్లీ గణేష్ 1976లో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వచ్చిన పట్టిన ప్రవేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.

ఢిల్లీ గణేష్ తమిళం, తెలుగు, మలయాళ సినిమాలలో 400 పైగా చిత్రాలలో కనిపించారు. తన నటనా జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన 1964 నుంచి 1974 వరకు ఒక దశాబ్దం పాటు భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఢిల్లీ గణేష్ నాయకన్ (1987), మైఖేల్ మధన కామరాజన్ (1990) వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు.

‘పసి’ (1979)లో అతని నటనకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు.  1994లో అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలిత అందించిన కలైమామణి అవార్డుతో సహా అనేక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు. ‘సింధు భైరవి’ (1985), ‘మైఖేల్ మదన కామ రాజన్’ (1990), ‘ఆహా..!’ (1997), ‘తెనాలి’ (2000). చిత్రాల మంచిగుర్తింపు నిచ్చాయి.ఢిల్లీ గణేష్ టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా కనిపించాడు.

ఢిల్లీ గణేష్ (Delhi Ganesh Movies)  ‘వాట్ ఇఫ్ బ్యాట్‌మ్యాన్ ఈజ్ ఫ్రమ్ చెన్నై’ అనే షార్ట్ ఫిల్మ్‌లో అతిథి పాత్రలు చేసారు. అందులో ఆయన ఆల్ఫ్రెడ్ పెన్నీవర్త్ వెర్షన్‌ను పోషించాడు. 2016లో, కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ‘ధూరువంగల్ పతినారు’లో శ్రీమాన్‌గా క్లుప్తమైన కానీ ప్రభావవంతమైన పాత్రను పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version