Saturday, April 19Welcome to Vandebhaarath

Delhi elections : ఢిల్లీలో గెలిగేది బిజేపీనే తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

Spread the love

Exit Polls 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు ఒకే విధమైన అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి . ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నిక‌ల్లో ఓటర్లు ఎవరికి ఎడ్జ్ ఇచ్చారన్న అంశంపైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచాయి.

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. కొన్ని పోల్స్ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో గట్టి పోటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించాయి. అదే సమయంలో, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే ప‌రిమితంకావొచ్చని తేల్చి చెప్పాయి. 70 స్థానాల ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ 36 సీట్లు గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి, షీలా దీక్షిత్ వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు, డిసెంబర్ 1998లో బిజెపి చివరిసారిగా అధికారంలో ఉంది.

ఎగ్జిట్ పోల్‌ అంచనాల ప్రకారం బిజెపి 35 నుండి 49 సీట్లు గెలుచుకోగలదని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఓడించే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఆప్‌ పార్టీ 21 నుండి 37 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఢిల్లీలో ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ గరిష్టంగా మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

Exit Polls Results : ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదీ

మ్యాట్రిజ్

  • బీజేపీకి 35-40,
  • ఆప్ కు 32-37 సీట్లు,
  • కాంగ్రెస్ కు 0-1 సీట్లు

పీపుల్స్ పల్స్

  • బీజేపీకి 51-60 సీట్లు,
  • ఆప్ కు 10-19 సీట్లు
  • కాంగ్రెస్ 0

పీమార్క్ ఎగ్జిట్ పోల్

  • బీజేపీకి 39-49 సీట్లు,
  • ఆప్‌కు 21-31 సీట్లు,
  • కాంగ్రెస్‌కు 0-1 సీట్లు

జేవీసీ

  • బీజేపీకి 39-45 సీట్లు
  • ఆప్ కు 22-31,
  • కాంగ్రెస్ కు 0-2 సీట్లు

పీపుల్స్ ఇన్ సైట్

  • బీజేపీకి 40-44 సీట్లు,
  • ఆప్ కు 25-29 సీట్లు,
  • కాంగ్రెస్ కు ఒక్క సీటు

చాణక్య స్ట్రాటజీ

  • బీజేపీకి 39-44 సీట్లు,
  • ఆప్‌కు 25-28 సీట్లు,
  • కాంగ్రెస్‌కు 2-3 సీట్లు

పోల్ డైరీ

  • బీజేపీకి 42-50 సీట్లు,
  • ఆప్‌కు 18-25 సీట్లు,
  • కాంగ్రెస్‌కు 0-2 సీట్లు

డీవీ రీసెర్చ్

  • బీజేపీకి 36-44 సీట్లు,
  • ఆప్ కు 26-34 సీట్లు

వీప్రెసైడ్

  • ఆప్‌కు 46-52 సీట్లు,
  • బీజేపీకి 18-23 సీట్లు,
  • కాంగ్రెస్‌కు 0-1 సీట్లు

జీనియా

  • ఆప్ కు 33-38 సీట్లు,
  • బీజేపీకి 31-36 సీట్లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version