Thursday, March 6Thank you for visiting

Defense Deal  | భార‌త్ కు త్వ‌ర‌లో ప్రిడేటర్ డ్రోన్‌లు.. వీటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

Spread the love

Defense Deal – Predator Drones | భారత ప్ర‌భుత్వం దేశ‌ సైనిక సామర్థ్యాలను పెంచుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈమేర‌కు 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా, దేశంలో జనరల్ అటామిక్స్-తయారీ డ్రోన్‌ల కోసం నిర్వహణ, మరమ్మతులు, వర్‌హాల్ (MRO) సౌకర్యాన్ని కూడా భారతదేశం ఏర్పాటు చేస్తుంది.

మీడియా నివేదికల ప్రకారం.. రెండు దేశాలు కూడా తరువాత సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని రూపొందించాలని చూస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని ఈ నెల ప్రారంభంలో భద్రతపై భారత క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ లావాదేవీ మొత్తం ఖర్చు $3.5 బిలియన్లుగా అంచనా వేసింది. డ్రోన్‌లను జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ (GA-ASI) విదేశీ మిలిటరీ సేల్స్ కాంట్రాక్ట్ కింద సరఫరా చేస్తుంది. భారత నావికాదళం 15 డ్రోన్‌లను పొందే అవకాశం ఉంది, ఇది ‘సీగార్డియన్’ వేరియంట్‌గా ఉంటుంది, ఆర్మీ, వైమానిక దళానికి ఒక్కొక్కటి ఎనిమిది ‘స్కై గార్డియన్’ ప్రిడేటర్ డ్రోన్‌లు కేటాయించనున్నారు.

గత ఏడాది ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలుపై భారత్‌ రక్షణ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందంపై యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాట్లాడుతూ.. రెండుదేశాల మధ్య సాంకేతిక సహకారం, సైనిక సహకారాన్ని పెంచుతుందని చెప్పారు. ప్రిడేటర్‌ డ్రోన్స్‌ ఎంక్యూ-9బీ కొనుగోలుతో హిందు మహాసముద్రంలో భారత వావికా దళం నిఘా సామర్థ్యం భారీగా పెరుగుతుందని రక్షణరంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రిడేటర్‌ డ్రోన్‌లను అమెరికన్‌ కంపెనీ జనరల్‌ అటామీక్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్నారు. భారత్‌, అమెరికా మధ్య విదేశీ సైనిక ఒప్పందం ప్రకారం ఈ డీల్‌ జరిగింది. డీల్‌లో భాగంగా 31 ప్రిడేటర్‌ డ్రోన్లను అమెరికా భారత్‌కు స‌ర‌ఫ‌రా చేయ‌నుంది.

డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులను భార‌త్ లోనే చేయ‌నునున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 15 డ్రోన్ల‌ను నేవికి, ఎనిమిది వైమానిక దళానికి, మరో ఎనిమిది ఆర్మీకి కేటాయించనున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌ సైతం తన నిఘా సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ వస్తోంది.

ప్రిడేటర్‌ డ్రోన్స్‌ ప్రత్యేకత‌లు ఇవే..

  • ఈ ప్రిడేటర్‌ డ్రోన్స్‌ ప్రత్యేకలు చాలా ఉన్నాయి. సుమారు 40వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సుమారు 40 గంటలు ఎగుర‌గ‌లగుతాయి.
  • విభిన్న‌మైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఎగిరే ల‌క్ష‌ణం వీటికి ఉంది.
  • ప్రిడేటర్ డ్రోన్లను మానవతా సహాయం, విపత్తుల సమయంలో ప‌రిశోధన, రెస్క్యూ ఆపరేషన్‌, యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఎయిర్‌బోర్న్ మైన్ కౌంటర్‌మెజర్లు కూడా ఉపయోగించవచ్చు.
  • శ‌త్రువుల‌పై దాడులు సైతం చేయొచ్చు.
  • 2022 జూలైలో ఈ డ్రోన్‌ సహాయంతో యూఎస్‌ హెల్‌ఫైర్‌ క్షిపణిని ప్రయోగించి అల్‌ఖైదా ఉగ్రవాది ఐమన్‌ అల్‌ జవహరిని అంత‌మొందించింది. ఈ డ్రోన్ హెల్‌ఫైర్‌ క్షిపణితో పాటు 450 కిలోల పేలోడ్‌తో ఎగురుతుంది.

ప్రిడేటర్ డ్రోన్‌లను తయారు చేసే జనరల్ అటామిక్స్, ఈ డ్రోన్ భాగాలను తయారు చేయడానికి భారత కంపెనీ భారత్ ఫోర్జ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.ఈ డ్రోన్‌ల మరమ్మతులు, నిర్వహణ కోసం కంపెనీ భారతదేశంలోనే ఎంఆర్‌వో హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు కంపెనీ తన సొంత స్వదేశీ యుద్ధ డ్రోన్‌లను తయారు చేయడానికి భారత్‌కు సహకారం అందించనుంది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version