Monday, March 3Thank you for visiting

ద‌స‌రా బంపర్ ఆఫర్.. ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు గొర్రె పొట్టేలు, మేక‌పోతు, ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు..

Spread the love

Dasara Lucky Draw : సాధార‌ణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందిన‌వారికి షీల్డ్‌లు, మెడ‌ల్స్‌, లేదా గృహోప‌క‌ర‌ణాల‌ను, చీర‌ల‌ను బ‌హుమ‌తులుగా ఇస్తారు. కానీ వీట‌న్నింటికీ భిన్నమైన బ‌హుమ‌తులను ఈగ్రామంలో అంద‌జేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్త‌గా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్త‌ల్లో నిలిచింది. ఈ బ‌హుమ‌తుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు.

Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్టోబరు 10న ఒక్కొక్కటి రూ.100 చొప్పున‌ కూపన్‌లను విక్రయించి ల‌క్కీ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ల‌క్కీ డ్రా గెలుచుకున్న‌వారికి గృహోపకరణాలు లేదా వాహనాలు, షీల్డులు, కాదు.. బోయపల్లి డ్రాలో మొదటి బహుమతి పొందిన లక్కీకి గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు. మూడు నుంచి ఆరవ బహుమతుల విజేతలకు జానీ వాకర్ స్కాచ్ విస్కీతో సహా వివిధ ధరలతో మద్యం బాటిల్‌ను అందించ‌నున్నారు. . అలాగే ఎనిమిది, తొమ్మిది, 10వ బహుమతి విజేతలకు ఒక్కొక్కరికి ఒక కంట్రీ చికెన్‌ లభిస్తుంది.

Dasara Prizes

“ఇటీవల ముగిసిన గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా, విజేతలకు ప్రత్యేకమైన బహుమతులు అందించడానికి లక్కీ డ్రాను నిర్వహించాలని నిర్ణ‌యించిన‌ట్లు నిర్వాహ‌కులు చెప్పారు. అయితే ఈ ల‌క్కీ డ్రాకు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. 24 గంటల్లోనే 600 కూపన్లు అమ్ముడయ్యాయి.

ఈ విష‌యం సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో తెలంగాణ , మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి వ‌చ్చి చాలా మంది ఈ కూపన్‌లను కొనుగోలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా నిజామాబాద్‌, రాజన్న-సిరిసిల్ల, నల్ల‌గొండ‌, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్‌, హైదరాబాద్‌తోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా లాట్‌ విత్‌ డ్రా ప్రకటించిన కొద్దిసేపటికే కూపన్‌లను కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ల‌క్కీ డ్రా సమయంలో భద్రత కోసం స్థానిక పోలీసులను అభ్యర్థించాలని యోచిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version