లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి
Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది. విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ నగారాలోని డిప్లొమా కాలేజీలో ఈ ఘటన జరిగింది.
సదరు విద్యార్థి క్లాస్ కు రాకపోవడంత లెక్చరర్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆగస్టు 23న కొడవలితో కాలేజీకి వెళ్లి తనపై ఫిర్యాదు చేసినందుకు లెక్చరర్‌ను బెదిరించాడు.
ఈ ఘటనపై లెక్చరర్ పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించగా బెల్లూరు పోలీసులు ఘటన...