Friday, March 14Thank you for visiting

Crime

#crime #truecrime #thriller #murder #drama #mystery #police #film #movie #criminal #news #truecrimecommunity #action #movies #horror #cinema #serialkiller #justice #bookstagram #o #s #love #podcast #truecrimeaddict #serialkillers #truecrimepodcast #law #comedy #covid #books

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

Crime, National
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆ...

బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి, 12 మందికి గాయాలు

Crime
భరత్పూర్:రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాతీయ రహదారిపై బస్సును ట్రక్కు ఢీకొనడంతో  11 మంది మరణించారు.  12 మంది గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్రిడ్జిపై నుంచి బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది.. బస్సు డ్రైవర్ తోపాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో. ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని దిహోర్‌కు చెందినవారు....

యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

Crime
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit womam) తన ముస్లిం స్నేహితురాలికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సెప్టెంబరు‌ 2న ఓ కేఫ్ కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ వద్దకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలి వెంట ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఓ వ్యక్తి బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొక...

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

Andhrapradesh, Crime
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదా...

మేకలను దొంగిలించారనే నెపంతో.. తలకిందులుగా వేలాడదీసి, పొగపెట్టి చిత్రహింసలు

Crime, Local
Mandamarri Incident: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. మేకలను చోరీ చేశారనే అనుమానంతో ఓ దళిత యువకుడితో పాటు అతడి స్నేహితుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. వివరాల్లోకి వెళితే.. మందమర్రి కి చెందిన కొమురాజుల రాములు కు చెందిన మేకల మందలో నుంచి రెండు మేకలు కనిపించకుండా పోయాయి. దీంతో పశువుల కాపరి తేజ, దళితుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్ పై అనుమానంతో ఇద్దరిని షెడ్డుకు పిలిపించారు. షెడ్డులో తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద పొగపెట్టి ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొమురాజుల రాములుతోపాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. మంచిర్యాల(mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో మేకలను చోరీ చేశారనే అనుమానంలో దళిత యువకుడితో పాటు పశువుల కాపరిని తాళ్లతో కట్టి వేలాడదీశారు. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగ...

రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

Crime
రాజస్థాన్‌లో మరో దిగ్బ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల గిరిజన మహిళను ఆమె భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఏడీజీ (క్రైమ్)ని సంఘటనా స్థలానికి పంపి, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సదరు మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, ఈ సంఘటన గురువారం జరిగిందని ధరియావాడ్ ఎస్‌హెచ్‌ఓ పెషావర్ ఖాన్ తెలిపారు. ఆమె అత్తమామలు ఆమెను కిడ్నాప్ చేసి ఘటన జరిగిన తమ గ్రామానికి తీసుకెళ్లారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఉమేష్ మిశ్రా తెలిపారు. ఆమె వేరే వ్యక్తితో ఉండడంతో ఆమె అత్తమామలు తట్టుకోలేకయారు. ఎడిజి (క్రైమ్) దినేష్ ఎంఎన్‌ని శుక్రవారం రాత్రి ప్రతాప్‌గఢ్‌కు వెళ్లి పరిశ...

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Crime, Local
Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...

మధ్యప్రదేశ్ లో దారుణం.. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలని దాడి..

Crime
మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసు ఉపసంహరించుకోకపోవడంతో బాధిత కుటుంబంలో ఓ యువకుడిని నిందితులు హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిని వివస్త్ర ను చేశారు. తనపై లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోకపోవడంతో ఓ నిందితులు బాధితులపై కక్ష పెంచుకున్నాడు. కేసు విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. ఈక్రమంలో నిందితుడు బాధితురాలి సోదరుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన అతడి తల్లిని వివస్త్రను చేసి దాడిచేశాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2019లో బాధితురాలి సోదరి దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ బాధితులతో వాగ్వాదం చేశాడు. కేసును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు బాధితుడు.. 18 ఏళ్ల నితిన్ అహిర్వార్‌ను కొట్టి ...

Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Crime
Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో " నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ "ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ చేయడానికి గ్యా...

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో మైనర్ కి జీవితఖైదు.. అసలేం జరిగింది…

Crime
Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరీలో నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 2022 సెప్టెంబర్ 14న ఇద్దరు టీనేజ్ బాలికలను వారి ఇంటి నుండి కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి చంపిన దారుణ ఘటనలో ఓ మైనర్ ను దోషిగా నిర్ధారించిన పోక్సో కోర్టు..అతడికి జీవిత ఖైదు విధించింది. అలాగే మొత్తం రూ.46,000 జరిమానా చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బ్రిజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ బాల నిందితుడిని ఆగస్టు 22న దోషిగా నిర్ధారించిన తర్వాత, అదనపు జిల్లా జడ్జి రాహుల్ సింగ్ ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం అతను దోషిగా తేలిన వివిధ సెక్షన్ల కింద శిక్షలను ప్రకటించిందని తెలిపారు. IPCలోని సెక్షన్ 302/34లో బాలనేరస్థుడికి జీవిత ఖైదు రూ.15,000 జరిమానా, సెక్షన్ 452 ప్రకారం ఐదేళ్ల జైలుశిక్ష రూ. 5,000 జరిమానా, అలాగే సెక్షన్ 363 కింద రూ. 5,000 జరిమానాతో ...
Exit mobile version