Monday, March 3Thank you for visiting

ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు

Spread the love

ఓ పోలీసు అధికారి ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఏకంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. ఉత్తరఖండ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించాడు. అదే సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి దిగగానే, కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనకు సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఈ వైరల్ వీడియో పై అధికారులు తక్షణమే స్పందించారు. ASPని నరేంద్ర నగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు.

ఈ సంఘటన ఆగస్టు 11న కోట్‌ద్వార్‌లో ముఖ్యమంత్రి హరిద్వార్ నుండి హెలికాప్టర్‌లో గ్రాస్తాన్‌గంజ్ హెలిప్యాడ్‌కు వచ్చినప్పుడు జరిగింది. ఆయన రాక గురించి తెలియగానే స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పరుగెత్తింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి ఒక చేత్తో ఫోన్ చెవిలో పెట్టుకుని మరో చేత్తో ముఖ్యమంత్రికి సెల్యూట్ చేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్త అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా జై బలూని కోట్‌ద్వార్‌లో నియమితులయ్యారు.

కాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోట్‌ద్వార్‌లో అనేక ఇళ్లు బురద, నీటితో మునిగిపోయాయి. వరద ఉదృతితో నదులు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. రెండు పెద్ద వంతెనలు, ఒక చిన్న వంతెనతో సహా మూడు వంతెనలు ఇప్పటికే కూలిపోయాయి. అటువంటి పరిస్థితుల మధ్య, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం కోట్‌ద్వార్‌లోని విపత్తు బాధిత ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version