Friday, March 14Thank you for visiting

Bastar dussehra : ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన 75 రోజుల దసరా వేడుకలు ఎక్కడో తెలుసా..

Spread the love

Bastar dussehra : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రత్యేకమైన దసరా వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి, 600 ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి గిరిజన ప్రజలు ‘కచ్చిన్’ దేవతకు ఆరాధిస్తారు. బస్తర్‌లోని ‘రాజ్ పరివార్’ కమిటీ ఈ ఉత్సవాలను ప్రారంభించింది.
ప్రధాన కార్యక్రమం జగదల్పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పట్టణం మొత్తం విస్తృతమైన అలంకరణలతో ముస్తాబైంది.

75 రోజుల వేడుకలు

Bastar dussehra వేడుకల విశిష్టత ఏమింటే.. బస్తర్‌లోని దసరా పండుగ సాధారణంగా 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన దసరా వేడుకగా నిలిచింది. బస్తర్‌లోని ఈ 75 రోజుల వేడుక విలక్షణమైన ఆచారాలను ప్రతిరోజూ పాటిస్తారు. దసరా (విజయదశమి) సందర్భంగా దేశమంతటా ‘రావణుని’ దిష్టిబొమ్మలను దహనం చేస్తే.. ఇక్కడ అలాంటి ఆచారం ఉండదు. ఈ పట్టణంలో ‘మహిషాసుర మర్దిని ఆదిశక్తికి’గా కొలుస్తారు. దసరా వేడుకల్లో జిల్లాలోని గిరిజన సంఘం ముఖ్యపాత్ర పోషిస్తుంది.బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయం జగదల్‌పూర్‌లో జరిగే పండుగలో గిరిజనులతో పాటు ఇతర ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు.
600 సంవత్సరాల నాటి ఆచారం ప్రకారం, బస్తర్ జిల్లాలోని ‘రాజ్ పరివార్’కి దసరా జరుపుకోవడానికి ‘కచ్చిన్’ దేవత అనుమతి ఇస్తుందని, అందుకే ఉత్సవాలు ప్రారంభమవుతాయని నమ్ముతారు.
దేవత ‘కాచిన్’గా భావించబడే ఒక మైనర్ బాలిక, ముళ్ల ఊయల మీద ఊయల ఊపుతూ ‘దసరా’ జరుపుకోవడానికి ‘రాజ్ పరివార్’ అనుమతిని మంజూరు చేసింది.
‘కలశ స్థాపన’. ‘రథయాత్ర’ ఈరోజు వేడుకలు మొదలవుతాయి అని రాజ్‌పరివార్‌కు చెందిన సభ్యుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ తెలిపారు. “మన రాజు ఇద్దరు కుమార్తెలు కచ్చిన్ దేవి, రైలా దేవిలు శత్రువులకు లొంగిపోకుండా అగ్నికి ఆహుతి చేసుకున్నారని నమ్ముతారు. అప్పటి నుంచి, కుమార్తెల పవిత్ర ఆత్మలు ఇక్కడే చుట్టూ తిరుగుతాయి. బాలిక స్వరూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తామని తెలిపారు.

 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version