Tuesday, March 4Thank you for visiting

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

Spread the love

న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు.

“తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

కాగా “నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద గోహత్యకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్-జనసంఘ్ లక్షలాది మంది మద్దతును కూడగట్టారు. అనేక మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. 30 నవంబర్ 1966 న, ఆర్‌ఎస్‌ఎస్-జనసంఘ్ పలుకుబడి, దీంతో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రభుత్వ సిబ్బంది చేరకుండా ఆంక్షలు విధించింది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version